అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి.
దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు. మోసంబీ లేదా స్వీట్ లైమ్ జ్యూస్
ఇండియాలో హాట్ ఫేవరెట్, ముఖ్యంగా సమ్మర్
సీజన్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఇవి చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా
ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే
దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత
పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్ రూపంలోనే
దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే
గుర్తుకొస్తాయి. బత్తాయి రసంలో విటమిన్ సి మరియు పొటాషియం పుష్లకంగా
ఉంటుంది. అంతే కాదు, రుచికరమైనది మరియు తాజాగా ఉండి మనల్ని రిఫ్రెష్
చేస్తాయి. .
పోషక
విలువలతోపాటు ఔషధపరంగా కూడా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం
వంటివి వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఈ పండ్లరసాన్నే అందిస్తారు. *
విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండుని మించింది
లేదు. రుచికి తియ్యగానే ఉన్నా ఇందులో విటమిన్-సి ఎక్కువపాళ్లలో
దొరుకుతుంది. * ఈ పండుకున్న తీపివాసన లాలాజలగ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం
అధికంగా వూరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్‌లు పిత్తరసంతోపాటు
ఇతర జీర్ణరసాలూ ఆమ్లాలూ విడుదలయ్యేందుకు దోహదపడతాయి. అందువల్ల తీసుకున్న
ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు, ఈ రసం త్వరగా జీర్ణమై రక్తంలో
వెంటనే కలిసిపోతుంది. అందుకే బెడ్‌మీద ఉన్న రోగులు కోలుకునేందుకు
బత్తాయిరసాన్నే ఇస్తుంటారు.
ఉదయాన్నే యోగా, జాగింగ్, వాకింగ్ చేసి వచ్చాక ఓ గ్లాసు తాజా బత్తాయిరసం తాగితే చాలు... అలసిన శరీరం వెంటనే శక్తిమంతం అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓ గ్లాసు బత్తాయిరసం తీసుకోవడం ఎంతో మంచిదని పోషకనిపుణులు సూచించేదీ ఇందుకే. * ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలతాయి. అందువల్ల అజీర్తితో బాధపడేవాళ్లకి కూడా బత్తాయిరసం ఎంతో మంచిది. ఇందులో ఎక్కువగా ఉండే పొటాషియం డయేరియా, డీసెంట్రీ... వంటి వ్యాధుల్ని వెంటనే తగ్గేలా చేయడంతోబాటు బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తుంది. ముఖ్యంగా కామెర్లు వచ్చినవాళ్లకు ఈ జ్యూస్ ఎంతో మంచిది. బత్తాయిపండు రుచి వాంతుల్ని అరికట్టి తలతిరగడాన్ని తగ్గిస్తుంది. * ఈ జ్యూస్ తాగడంవల్ల చిగుళ్లనొప్పులు, గొంతుసంబంధ ఇన్ఫెక్షన్లూ త్వరగా తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగడంవల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దాంతో రక్తప్రసారం చక్కగా ఉండి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కంటిచూపు కూడా బాగుంటుంది. ఇందులోని లివోనాయిడ్‌లు వూపిరితిత్తుల్ని శుభ్రంచేయడంలోనూ రక్షించడంలోనూ కీలకపాత్ర వహిస్తాయి. * చర్మానికీ మంచిదే. క్రమం తప్పక తీసుకోవడంవల్ల మచ్చల్ని మాయం చేసి చర్మం మెరుపుని సంతరించుకునేలా చేస్తుంది. ఆటలాడి వచ్చిన పిల్లలకు కూడా రాగానే తాజా బత్తాయిరసాన్ని ఇస్తే దాహం తీరి స్థిమితపడతారు. దాహాన్ని తీర్చడంలో తాజా బత్తాయిరసాన్ని మించింది లేదు. చూశారుగా, ఇంకా ఆలస్యమెందుకు... అసలే ఇది బత్తాయిలు ఎక్కువగా వచ్చే సీజన్. రసం తీసేయండి మరి!

No comments:
Post a Comment