Monday, May 8

వ్యర్థ పదార్థాలను తొలగించే గోరు వెచ్చని నీరు..!

నీటిని సరైన మోతాదులో తాగడం వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు వున్నాయి.. రోజుకు సరిపడా నీటిని తాగడం తప్పనిసరి.. చల్లటి నీరు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం.. అయితే ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
1. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తం సరిగ్గా అందుతుంది. వ్యర్థ పదార్థాలు కూడా తొలగించబడతాయి. షుగర్ జబ్బు వస్తుందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషదంగా పనిచేస్తుంది.
2. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. యాంటీ ఏజింగ్ లక్షణాలు తగ్గిపోతాయి. ప్రధానంగా మహిళలకు ఇలా నీటిని తాగడం ఎంతో మేలు చేస్తుంది.
3. కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ప్రధానంగా రుతు సమయంలో మహిళలకు వచ్చే సమస్యలు అంతగా బాధించవు. శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
4. బరువు వేగంగా తగ్గాలనుకునే వారు నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం ప్రక్రియ వేగవంతమవుతుంది. దీంతో అదనంగా ఉన్న క్యాలరీలన్నీ త్వర త్వరగా ఖర్చయిపోతాయి.
5. మెటబాలిజం ప్రక్రియ మెరుగు పడుతుంది. దీని వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. మనం తినే ఆహారం నుంచి ఎప్పటికప్పుడు విడుదలయ్యే క్యాలరీలను శరీరం ఖర్చు చేస్తుంది.
6. బాగా జలుబు చేసినప్పుడు రోజుకు రెండుసార్లు వేడినీళ్లలో కాస్త విక్స్, లేదా పసుపు, వేప ఆకులు వేసి ఆవిరి పట్టండి. ఆ తరువాత మీకు ఎంత ఉపశమనం కలుగుతోందో చుడండి.

No comments:

Post a Comment