Wednesday, May 10

కరివేపాకుతో మెరుపు...

కరివేపాకు కూరలో ఎంతటి సువాసన ఇస్తుందో ముఖానికీ అంతే సౌందర్యాన్ని తెస్తుంది. జుట్టుకూ పోషణనిస్తుంది. ఇందులోని ఎ,సి విటమిన్లు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి...
  1. కొబ్బరినూనెని వేడి చేసి అందులో గుప్పెడు కరివేపాకులు వేయాలి. దీన్ని తలస్నానం చేసేందుకు అరగంట ముందు జుట్టుకు రాసుకోవాలి. ఈ నూనె వల్ల జుట్టు నెరుపు సమస్య ఉండదు. కుదుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
  2. పచ్చి కరివేపాకును నూరి ముద్దలా చేసి దానికి సరిపడా పెరుగు చేర్చి జుట్టుకు రాయాలి. ఇరవ్కె నిమిషాల తర్వాత గాఢత తక్కువున్న షాంపూతో కడిగేయాలి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రూ అదుపులో ఉంటుంది.
  3. కొన్ని కరివేపాకులను మెత్తగా చేసి దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్న చోట రాస్తే అవి తగ్గుతాయి. గుప్పెడు కరివేపాకును మెత్తగా చేసి దానికి చెంచా చొప్పున ముల్తానీమట్టీ, గులాబీ నీరు కలపాలి. ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది ముఖం మీద మచ్చలను, వలయాలను తగ్గించి మెరిసేలా చేస్తుంది. ముల్తానీమట్టి ముఖం మీద ఎక్కువగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. గులాబీ నీళ్లు సహజ రంగును ఇవ్వడంలో సాయపడతాయి.
  4. రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటి మచ్చలు ఉన్న చోట రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. దీనివల్ల మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.
  5. రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడు చెంచాల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి పావు గంట తర్వాత కడిగేయాలి. ఆలివ్‌ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌, తేమ గుణాలు చర్మాన్ని మ దువుగా మారుస్తాయి. ు

No comments:

Post a Comment