అల్లం.. దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు
చేస్తాయి. అందుకే ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఈ రెంటికి కాస్త
తేనె, నిమ్మరసం కలిపి టీ చేసుకుని తాగితే అమ్మాయిలకు ఎంతో మంచిదని
చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు...
- అల్లం జీర్ణవ్యవస్థకు మేలు చేసే ఆమ్లాలు విడుదలచేస్తుంది. జీర్ణాశయాన్ని శుభ్రం చేసి అరుగుదల పెంచుతుంది. శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు ఈ చారుని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలానే జలుబూ, అలర్జీల వంటివి కూడా అల్లం తీసుకోవడం వల్ల త్వరగా తగ్గుతాయి. అల్లంలో అమినో ఆమ్లాలూ, విటమిన్లూ, ఖనిజాలూ.. అధికంగా ఉండటం వల్ల హృదయానికి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధపడేవాళ్లు...కప్పు అల్లం చారులో చెంచా తేనె వేసి తాగితే కడుపు నొప్పితోపాటూ, అధిక రక్తస్రావం కూడా తగ్గుతుంది.
- ఇక దాల్చిన చెక్కలో శక్తిమంతమైన పోషకాలున్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. ఇది మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది.కొవ్వు సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క టీని రోజూ తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. శరీరాన్ని ఇబ్బందిపెట్టే వాపూ, మంటా, అలెర్జీతో పాటూ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుందీ చారు. దాల్చిన చెక్కని పొడి కొట్టుకుని పెట్టుకుంటే ఆరునెలలు ఉంటుంది. చెక్క రూపంలోనే ఉంచితే ఏడాది పాటు దాని సుగుణాలు పదిలంగా ఉంటాయి. దీన్ని అచ్చంగా చారులా చేసుకోవచ్చు లేదా మామూలు టీలోనూ కొద్దిగా కలుపుకోవచ్చు.గుండె ఆరోగ్యానికి ఈ చారు ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
No comments:
Post a Comment