సుగంధ పరిమళాలను వెదజల్లటంలో గులాబీ పాత్ర కీలకం.
ఇది సౌంద్యర సాధనంగా కూడా అద్భుతంగా పని చేస్తుంది. గులాబీలోని ప్రతి
భాగం ఔషధగుణాలను కల్గి ఉంటుంది. ఇవి ముఖ్యంగా చర్మాన్ని శుభ్రంగా,
కోమలంగా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. చర్మ సౌందర్యాన్ని
రెట్టింపు చేసుకోవాలి అనుకునే వారు గులాబీ నీళ్ళను కింది విధంగా ఉపయోగిస్తే
చాలా మంచి ఫలితం కనిపిస్తుంది...
- సహజంగా ముఖానికి ఏదైన మాస్క్ వేసుకుంటే తొలగించు కోవటానికి ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తారు. అలా కాకుండా సహజ సిద్ధంగా మాస్క్‌ను తొలగించుకోవాలంటే గులాబీ నీటిని ఒక గ్లాసులో తీసుకుని దాంట్లో కాటన్ క్లాత్ ను ముంచి ముఖం పై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.
- అలాగే చర్మం పై ఎక్కడన్నా కాలినా, కమిలినట్లు అనిపించినా, చిన్నగా గీరుకుపోయినా... గులాబీ నీళ్లలో కాటన్ క్లాత్ ముంచి ఆ ప్రాంతంలో ఉంచడం వల్ల మంట తగ్గి చర్మం చల్లగా, మృదువుగా మారుతుంది.
- చర్మం ఎక్కువగా పొడిబారి చికాకు కలిగిస్తే ఇలా చేయండి. మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించండి. ఇలా పట్టించిన పది నిమిషాల్లోనే చర్మం మృదువుగా తయారవుతుంది.
- ఎక్కువగా ఒత్తిడికి గురి అయితే రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే చాలా రిలాక్స్ ఉంటుంది .
No comments:
Post a Comment