Saturday, May 20

టమాటాతో అద్భుతం...

అకేషనైన్‌ చిన్నదైనా... పెద్దదైనా... బ్యూటీ పార్లరుకు వెళ్లటం ఓ అలవాటుగా మారిపోయింది. ఇలా ప్రతి చిన్న పార్టీకీ పార్లరుకు వెళ్లటం వల్ల రసాయనాల ప్రభావం ముఖంపై పడి చర్మం తొందరగా ముడతలు పడటం, రంగు మారటం వంటివి జరుగుతాయి. అలా కాకుండా సహజంగా ఇంట్లో ఉండే టమాటాలతో చర్మాన్ని, అందంగా, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది...
  1. టమాటా గుజ్జులో కొద్దిగా బియ్యపు పిండి, కొంచెం పెరుగు కలుపుకొని పేస్టులా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకొని పది నిమిషాలయ్యాక చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
  2. ముఖం నల్లగా, నిర్జీవంగా కనిపిస్తే ఇలా చేయండి. టమాటా గుజ్జులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు పట్టించి. అది ఆరిపోయాక చల్లటి నీటితో కడిగితే చర్మం రంగు మారి తాజాగా కనిపిస్తుంది.
  3. అలాగే ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బంది పెడుతుంటే టమాటా గుజ్జులో ముల్తానీ మట్టి కలిపి ముఖానికి పట్టించాలి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
  4. పార్టీకి వెళ్ళే కంటే పది నిమిషాల ముందు ముఖానికి ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. టమాటా గుజ్జులో కొద్దిగా గంధం పొడి కలుపుకొని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది. ఇది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది.
  5. అలాగే టమాటా గుజ్జులో కొన్ని పచ్చి పాలు కలిపి ముఖానికి పది నిమిషాలు పట్టించి తర్వాత చల్లటి నీటితో కడిగితే ముడతలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.

No comments:

Post a Comment