Saturday, May 6

మద్యం.. దుష్ప్రభావం...

మద్యం అలా కడుపు (అన్నకోశం)లోకి వెళ్లీ వెళ్లగానే దాని దుష్ప్రభావం రెండు రకాలుగా మొదలవుతుంది. ఒకటి దాని నిర్మాణం మీద. రెండోది దాని విధులపైన. తొలుత అన్నకోశం నుంచి ఆల్కహాల్‌ రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. చాలా భాగం జీర్ణపక్రియకు గురి కాకుండానే రక్తంలో కలుస్తుంది. మద్యం నేరుగా చాలాసేపు అన్నకోశంలో ఉండటం వల్ల అక్కడి మ దువైన పొరలు (మ్యూకోజా) దెబ్బతింటాయి. అక్కడి మ్యూకోజాపై అది దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల జీర్ణకోశం పైభాగంలో అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా అప్పటికప్పుడు తగిలే దెబ్బతో పాటు దీర్ఘకాలికంగా ఉండే దుష్పరిణామాలు సైతం ఉంటాయి.
అన్నకోశంలోని మ్యూకోజాతో పాటు ఇతరత్రా కణజాలాన్ని మద్యం దెబ్బతీయడం వల్ల జీర్ణప్రక్రియ జరిగే క్రమంలో మార్పు వస్తుంది. జీర్ణక్రియ సమర్థంగా జరగకపోవడం ఫలితంగా శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి పరిణామాలు సంభవించొచ్చు. పైగా నిత్యం ఆల్కహాల్‌ తీసుకుంటూ ఉండటం వల్ల మ్యూకోజాపై రోజూ ప్రభావం పడి అక్కడ పుండ్లు, కురుపులు పడొచ్చు.
నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్‌ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నకోశం (స్టమక్‌)లోనే ఉండిపోతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్‌ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించొచ్చు. తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.

No comments:

Post a Comment