Friday, May 5

చేదైనా.. ఔషధ గుణాలు పుష్కలం...

బాగా వేడి వేడి అన్నంలో కరకరలాడే కాకరకాయ కారం కలుపుకుని నాలుగు నేతి చుక్కలు వేసుకుని తింటే ఆ రుచి భలే ఉంటుంది. చాలా మంది రకరకాల పద్ధతుల్లో కాకరకాయలను పంటలో చేర్చి ఇష్టంగా తింటుంటారు. వాస్తవానికి కాకర చేదుగా ఉన్నా అది పనిచేసే గుణం చాలా ఎక్కువ. రక్తంలో అధికంగా ఉన్న షుగర్‌కు ఏ ఇంజక్షన్‌ అక్కరలేకుండా తగ్గించి బ్యాలెన్సుగా నిలబెట్ట గల శక్తివంతమైన కూరగాయ ఏదంటే కాకర కాయనే చెప్పాలి. పెళుసుగా, గరకుగా ఉండే పై పొరతో చూడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది కనుక కటిక చేదుగానూ ఉంటుంది. అయితే పుష్కలమైన వైద్య గుణాలను కలిగి ఉన్న కాకరకాయ జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుంది.
శరీరంలో ఉన్న అధిక కొవ్వును తగ్గించడంలో కాకరకాయ చక్కగా పనిచేస్తుంది. ఇది విటమిన్‌-ఎ రిబోప్లావిన్‌, విటమిన్‌-సి దాతువులు ముఖ్యంగా ఐరన్‌ వంటివి సహజంగా ఉన్న కూరగాయ. మలబద్దకాన్ని నివారించే గుణం ఉన్నది. కేన్సర్‌ లాంటి దీర్ఘవ్యాధులను అరికట్టడంలో చాలా ఉపకరిస్తుంది. సోరియాసిస్‌ వ్యాధిని నివారించడంలో మంచి ఫలితాలను ఇస్తుంది. కాకరకాయను వీలైనంత ఎక్కువగా అంటే రోజు విడిచి రోజు ఆహారంలో తింటుంటే రక్తప్రసరణ చక్కగా జరిగి, తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాకర కాయ వలన బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది. వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి, అజీర్ణం తగ్గతుంది. అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు మెల్లగా కాకరకాయను కూరగా అలవాటు చేసుకుంటుంటే అందులో రుచి పెరుగుతుంది. అందులో ఉన్న ఔషధగుణాలతో ఆరోగ్యం మెరుగవుతుంది.

No comments:

Post a Comment