ఆహారానికి మంచి రుచిని, సువాసనను ఇచ్చే
జీలకరను చాలా మంది ఇష్టపడతారు. కానీ, మితిమీరిన స్థాయిలో దీన్ని వాడడం వలన
చాలా సమస్యలున్నాయని నిపుణులు చెబుతున్నారు...
- జీలకర్ర పొట్టలో కలిగే గ్యాస్ సమస్యలను తగ్గిస్తుందని అందరికి తెలిసిందే కానీ, జీలకర ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కలగవచ్చు, దీంతో గుండెలో మంట వస్తుంది. జీలకర జీర్ణవాహికలో ఉండే గ్యాస్ ను జీలకర్ర పూర్తిగా తొలగించే సమయంలో గుండె మంట వస్తుంది.
- జీలకరలో ఉండే నూనెలు అస్థిర గుణాలను కలిగి ఉంటాయి, వీటిని అధిక మొత్తంలో చాలాకాలం పాటు తీసుకోవడం వలన కాలేయం, మూత్రపిండాల సమస్యలు ఏర్పడతాయి.
- జీలకరను అధిక స్థాయిలో తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి.
- ఏదైనా శస్త్ర చికిత్స తీసుకోవటానికి రెండు వారాల ముందు నుంచీ జీలకరను తీసుకోవటం మానేయమని వైద్యుడు సలహా ఇస్తాడు.
- మధుమేహా వ్యాధి గ్రస్తులు వారి శరీరంలోని చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుకోవాలి. వీరిలో రక్తంలోని చక్కెర స్థాయిలు ఆటుపోటులకు గురవకుండా చాలా జాగ్రత్తపడాలి. జీలకర విత్తనాలు త్వరగా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి కాబట్టి, మధుమేహ వ్యాధి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

No comments:
Post a Comment