పాలు సహజ సిద్ధమైన సప్లిమెంట్. ఇది మంచి యాంటీ
ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం,
కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ 'డి' 'కె' 'ఇ' లు సమృద్ధిగా
ఉంటాయి. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి
చెబుతున్నారు నిపుణులు...
- పాలు: జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు బాగా మరిగించిన పాలల్లో సగం చెంచా పసుపు పొడి వేసుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు.
- మొటిమలకు: చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచటంలో పాల పాత్ర కీలకం. అలాగే మొటిమలను తగ్గించటంతో పాటు మచ్చలు రాకుండా కాపాడుతుంది. ఒక చెంచా పాలల్లో చిటికెడు పసుపు, సగం చెంచా తేనెను కలిపి ముఖంపై పెట్టుకోవాలి. ఇలా పది నిమిషాలు పెట్టుకున్న తరువాత చల్లని నీటితో కడిగితే సరిపోతుంది.
- డిటాక్సిఫికేషన్: సగం కప్పు పాలల్లో ఒక చెంచా పసుపు, కొద్దిగా తేనె, ఒక చెంచా లెమన్ జ్యూస్‌ను వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీళ్లను రోజూ ఉదయం పూట గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.శరీరంలో మలినాలన్ని పోతాయి.
- ఫెేస్ మాస్క్: పొడిబారిన ముఖానికి పచ్చిపాలను ఫేస్ మాస్క్‌లా పెడితే మంచి ఫలితం ఉంటుంది. ముందుగా ఒక చెంచా చిక్కటి పాలల్లో చిటికెడు పసుపు, సగం చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ముఖంపై ప్యాక్ ఎండిపోయాక చల్లని నీటితో కడిగితే సరిపోతుంది.
- దురదకు: చర్మం దురద పెడితే ఎన్నో రకాల మందులను వాడుతుంటారు. అలా కాకుండా సహజ సిద్ధంగా ఇంట్లో ఔషధాన్ని తయారు చేసుకుంటే ఏలాంటి సైడ్ ఎఫెక్ట్సు ఉండవు. ఒక చెంచా పాలల్లో సగం చెంచా పసుపు, ఒక చెంచా కలబంద జెల్‌ను కలిపి దురద ఉండే ప్రదేశంలో పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల దురద తొందరంగా తగ్గిపోతుంది.
- నోటి శుభ్రతకు: నోటిలో వచ్చే అల్సర్‌ను తగ్గించటంలో కొబ్బరి, కొబ్బరి పాల పాత్ర కీలకం. దీని కోసం ముందుగా ఒక చెంచా కొబ్బరి పాలల్లో రెండు చెంచాల పసుపు, సగం చెంచా నీళ్లు, సగం చెంచా కొబ్బరి నూనెను కలపాలి. ఆ నీటిని నోటిలో కొద్ది సమయం ఉంచుకుని తరువాత పుక్కిలిస్తే సరిపోతుంది.

No comments:
Post a Comment