- ఈ సీజన్లో పుష్కలంగా లభించే మామిడి పండ్లను తొక్కతో సహా అలాగే తింటే కెరోటినాయిడ్లు , పాలీఫినాల్స్, ఒమెగా-3, ఒమెగా-6 యాసిడ్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు బాగా లభిస్తాయి. క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులను అవి దూరం చేస్తాయి.
- యాపిల్ పండ్లలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు కూడా అధికమే. ఇవన్నీ పండులో ఎంత మోతాదులో ఉంటాయో, దాని తొక్కలోనూ అంతే స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ పండ్లను
- తొక్క తీయకుండా తింటేనే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పియర్స్ పండ్లను తొక్క తీయకుండా తింటే, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో నూట్రియంట్లు శరీరానికి ఎక్కువ మోతాదులో అందుతాయి. వీటి తొక్కల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపులను, నొప్పులను తగ్గిస్తాయి.
- సపోటా పండ్లను చాలా మంది తొక్క తీసి తింటారు. వీటిని శుభ్రంగా కడుక్కుని, తొక్కతో సహా తింటేనే మంచిది. దీనివల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది. శరీరానికి పొటాషియం, ఐరన్, ఫోలేట్, పాంటోథెనిక్ యాసిడ్ వంటి కీలక పోషకాలు అందుతాయి.
- ఫ్లమ్స్ పండ్లని కూడా తొక్క తీయకుండా తినాలి. ఆందోళనను, ఒత్తిడిని దూరం చేసే ఔషధ గుణం ఈ పండ్ల తొక్కల్లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి ఉండడం వల్ల, వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.
- కివీపండ్లను తొక్క తీయకుండా తినడం వల్ల శరీరానికి విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగి, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Wednesday, May 10
తొక్క తియ్యకుండా తినేయండి!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment