Sunday, May 21

ఇట్లా తినొద్దు...

మనం తినే ఆహారం మీద ఆరోగ్యం, అందం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆరోగ్యంతో ఉండాలన్నా, అందంగా కనిపించాలన్న మంచి ఆహారం తీసుకోవాలి. మీరు కడుపులోకి ఏం తీసుకుంటే అది మీ ముఖంలో ప్రతిబింబిస్తుంది. అందుకే తినకూడని ఆహార పదార్థాలేంటో చూద్దాం...
  1. ఫాస్ట్‌ ఫుడ్స్‌లో నూడిల్స్‌, స్మైలీస్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటివి తినడానికి రుచిగా అనిపించవచ్చు. అయితే వీటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో ఆయిల్‌ మరియు సాల్ట్‌ అధికంగా ఉండటం వల్ల స్కిన్‌ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినే అలవాటును మానుకోవాలి.
  2. మాంసం తినడం, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే భాగాలు తినడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ కు దారితీస్తుంది. వీటిలో శ్యాచురేటెడ్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధికంగా తినడంవ వల్ల ఫ్రీరాడికల్స్‌ పునరుత్పత్తి అవుతాయి. దీనివల్ల వయసుపైబడిన వారిలా కనిపిస్తారు.
  3. నిల్వ చేసిన ఆహారపదార్థాలు, చిప్స్‌లో ఉండే నూనె చర్మాన్నే కాదు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి చిప్స్‌, నిల్వ ఆహారపదార్థాలు వంటివి తీసుకోకపోవడం మంచిది.
  4. చాలా మంది ఆరోగ్యం, అందం కోసం ఫుడ్‌ సప్లిమెంట్‌ తీసుకుంటుంటారు. ఇది ఒకరకంగా శరీరానికి మంచిదే. అయితే సప్లిమెంట్‌ తీసుకునేటప్పుడు అకస్మాత్తుగా చర్మంలో మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఒక వేళ మీరు తిసున్న సప్లిమెంట్‌ క్వాలిటీ మీ శరీరానికి సరిపడకపోవచ్చు.
  5. పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ చర్మ తత్వాన్ని బట్టి అవి చర్మం మీద పనిచేస్తాయి. హార్మోనుల అభివృద్ధిలో కూడా కీలకం. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కానీ అధికంగా తీసుకోవడం వల్ల ఫలితంగా చర్మంలో మొటిమలు, మచ్చలు, పెరిగి తర్వగా వయసుపైబడిన వారిలా కనబడతారు.
  6. ఎండాకాలం కదాని,, చాలా మంది జ్యూస్‌లు ఎక్కువగా తాగుతుంటారు. జ్యూస్‌లు ఆరోగ్యానికి మంచివే. కానీ జ్యూస్‌ చేయడం వల్ల వాటిలోని ఫైబర్‌ కంటెంట్‌ పక్కకు పోతుంది. ఫైబర్‌ లోపం వల్ల కూడా చర్మం సౌందర్యం దెబ్బతింటుంది. శరీరంలో ఫైబర్‌ కంటెంట్‌ ఉంటే బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది.
  7. ఆల్కహాల్‌ ఉన్న ఏ డ్రింక్‌ తీసుకున్నా.. డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఇవి చర్మంలోని తేమను తగ్గిస్తాయి. దాంతో చర్మం నిగారింపు తగ్గిపోతుంది.
  8. రోజువారి ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం డ్రైగా, డల్‌ గా మారుతుంది. కాబట్టి రెగ్యులర్‌ డైట్‌ లో ఉప్పు తగ్గించాలి.

No comments:

Post a Comment