Saturday, May 27

నీళ్లతోనే ఆరోగ్యం...

మనలో చాలామందికి మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. వేసవి కూడా వచ్చేసింది కాబట్టే దాహంవేస్తే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం...

మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే ఉంది. మన శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలను పంపేది నీరే. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహించేది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ వల్ల రకరకాల తలనొప్పులు, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభమవుతాయి. అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు తాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి లీటరులో మూడోవంతు నీరు తప్పనిసరిగా తాగాలి.
విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావులీటరు నీరు తప్పక తాగాలి. మంచినీరు శరీరానికి అందకపోతే నీరసించిపోతాం. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనీ చేయలేం. కళ్లుబైర్లు కమ్ముతాయి. కాఫీ తాగే అలవాటున్న వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాల్సి ఉంటుంది. కారణం కాఫీలోని కెఫైన్‌ కారణంగా మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్‌కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన తలనొప్పి కూడా వస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసుల నీరు తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి. ఆహారం తిన్నాక రెండు గంటల తర్వాత నీరు తాగాలి. ఆహారంతో పాటు, ముద్దముద్దకు నీరు తాగడం మంచిది కాదు. గోళ్లు, జుట్టు, శరీరం అన్నిభాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 8-10 గ్లాసులు నీరు తాగాల్సిందే. నీటిని కాచి, వడబోసి తాగితే ఆరోగ్యకరం.

No comments:

Post a Comment