కూర ఎంత ఇష్టంగా చేసినా దాంట్లో చిటికెడు
ఉప్పు తగ్గిన ఆ కూర నోటికి రుచిగా అనిపించదు. రుచి కోసం ఎన్ని
ఫ్లేవర్స్ వేసినా చివరకు ఉప్పు దగ్గరకు రావాల్సిందే ! అలాగే కొన్ని రకాల
ఉప్పులు న్యూట్రీషనల్ గుణాలను కలిగి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
అలాంటి కొన్ని ఉప్పుల గురించి తెలుసుకుందాం...
- ప్రతిరోజూ వంటలో ఉపయోగించే ఉప్పు వల్ల చాలా లాభాలుంటాయి. ఈ ఉప్పు ఆహారంలో తొందరగా కలిసి పోతుంది. దీంట్లో అయోడిన్ ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్యలు దూరం అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వివరాల ప్రకారం అయోడిన్ ఉన్న ఉప్పును తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండటామే కాకుండా పిల్లల మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుందట.
- కేసరు ఉప్పు మంచి ఔషధం. దీంట్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు, చురుగ్గా ఉండటానికి ఉపయోగపడుతుంది. కేసరు ఉప్పును ఆహారంలో వేసుకోవటం వల్ల వంటల రుచి కూడా బాగుంటుంది. ఇది ముఖ్యంగా అధిక రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
- సముద్రపు ఉప్పు ఖనిజ లవణాలు, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, అయోడిన్‌ను కలిగి ఉంటుంది.
- సోడియం తక్కువగా ఉండే ఉప్పును ఉపయోగించటం వల్ల అధిక రక్త పోటు తగ్గుతుంది. ఉప్పులో సోడియం శాతం 30 శాతం కంటే తక్కువగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.
- హిమాలయ రాయి నుంచి లేత గులాబీ రంగు ఉప్పును తయారు చేస్తారు. దీంట్లో మినరల్స్ ఎక్కువ శాతం ఉంటాయి. అలాగే ఈ ఉప్పు ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.ఇది శరీరంలో పిహెచ్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపించటంలో దీని పాత్ర కీలకం.
No comments:
Post a Comment