మల్లె టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తినీ పెంచుతుంది.
వృద్ధాప్య లక్షణాలూ దరిచేరనివ్వదు. అంతేకాదు గుండెపోటూ, బ్రెయిన్
స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిళ్లు
కప్పు ఈ టీని తాగడం వల్ల కలత లేని నిద్ర సొంతమవుతుంది. ఇందులో జలుబూ,
జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్
గుణాలెక్కువ. ఇందులోని కాచెన్స్ అనే గుణాలు (సీఏటీఈసీహెచ్‌ఐఎన్‌ఎస్)
జీవక్రియల వేగాన్ని పెంచి, ఎక్కువ కెలొరీలు కరిగేలా చేస్తాయి.
* మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎక్కువ పనులతో అలసటగా ఉన్నప్పుడు
ఈ నూనెను వాసన చూస్తే చాలు. మల్లె చర్మానికి రక్షణగా ఉంటుంది. మల్లె నూనె
చర్మానికి తేమనందిస్తుంది. అంతేకాదు.. ఇది చర్మంలోని సాగేగుణాన్ని
పెంచుతుంది. దాంతో చర్మం తాజాగా మారి, పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది.
చర్మంపై పేరుకునే రకరకాల మచ్చల్ని నివారించడంలోనూ ఈ నూనె కీలకంగా
పనిచేస్తుంది.
No comments:
Post a Comment