వయసు పెరిగేకొద్దీ దృష్టి మందగించడం సాధారణం. తగినంత బీటా కెరోటిన్,
జింక్, ఇ,సి విటమిన్లు తీసుకుంటే అరవయ్యేళ్ళు దాక కూడా 35 శాతం వరకూ
దృష్టి మందగించే సమస్య ఉండదని తాజా పరిశోధన చెబుతోంది. సాధారణంగా వయసుతో
వచ్చే ఈ సమస్యను ఏజ్‌రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. పైన
పేర్కొన్న పోషకాలను సప్లిమెంట్లుగా ఇచ్చినప్పుడు సమస్య తలెత్తడం తగ్గినట్లు
పరిశోధన చెబుతోంది. బీటా కెరోటిన్ ముఖ్యంగా రాత్రి వేళల్లో బాగా
కన్పించేలా చేస్తుంది. ఇది క్యారెట్లలోనే కాకుండా పాలకూర, బ్రాకోలి
తదితరాల్లో ఉంటుంది. నట్స్ , వంట నూనెలు, గుడ్లు, ధాన్యాల నుంచి ఇ
విటమిన్, సముద్ర ఆహార పదార్థాల నుంచి కోడి మాంసం, పాల ఉత్పత్తుల నుంచి
జింక్, నిమ్మజాతి పండ్ల నుంచి విటమిన్ సి లభిస్తాయి. వయసు పెరుగుతోంది
కాబట్టి ఇది మామూలే అనుకోకుండా ఈ ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకుంటూ
దృష్టిలోపాలకు దూరంగా ఉండమని పరిశోధకుల సూచన.
ఇలా – మిలమిల మెరిసే కళ్ళను ప్రతి మహిళ ఇష్టపడుతుంది. రోజువారీ ఆహారంలో క్యారట్స్ తప్పనిసరిగా తీసుకోవడం వల్ల జుట్టు, చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు. పచ్చిదానిలో కన్నా కూడా ఉడికించిన క్యారట్స్ లో మూడురెట్లు అధికంగా యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి.
అతి అనర్థదాయకమే..
పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ, పౌష్టికాహారం ఎక్కువ తీసుకోవడం కూడా ఒంటికి చేటు తెస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిర్దేశిత మోతాదును మరిచి అతిగా ఆహారం తీసుకుంటే పౌష్టికాహారం కూడా అనారోగ్యం పాలు చేస్తుందని అంటున్నారు. ఒంటిలో కొలెస్టరాల్ పెరిగి స్థూలకాయం బారిన పడాల్సిందే. పాలు ఎక్కువగా తాగేవారు, మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్ళు గుండె సంబంధిత వ్యాధులకూ గురికావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జింక్‌ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువ కాలరీల శక్తిని తీసుకుంటారు. దీన్ని ఖర్చు చేయాలంటే తగిన వ్యాయామం తప్పనిసరి. అలా చేయలేని పక్షంలో శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రెండో దశలో ఊబకాయం రావడం, బరువు పెరిగిపోవడం జరుగుతుంది. వీటి ఫలితంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ఇది మూడో దశ, నాలుగో దశలో అత్రోక్లెరోసిన్ ఇతర హృదయ సంబంధ వ్యాధులు చుట్టుముడతాయి. ఇప్పటికే గుండె జబ్బులలో బాధపడేవారు కొలెస్ట్రాల్ రహిత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గుదలకు మందులేవీ లేవు. కొన్ని రకాల డ్రగ్స్ ఉన్నా, అవి క్యాన్సర్, గుండె సంబంధ, మానసిక వ్యాధులను కొనితెస్తాయి. కాబట్టి మిత ఆహారం, తగిన వ్యాయామమే కొలెస్ట్రారాల్ నివారణకు మందు.
ఇలా ట్రై చేయండి..
దంపుడు బయ్యం, పెసర పప్పు, ఎండు ఖర్జూరాలు, పెరుగు, బాదం, మజ్జిగ సమృద్ధిగా తీసుకోవాలి.
ఉడకబెట్టిన చేపలు గుండెకు, నాడీ వ్యవస్థకు మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజలు, మెంతికూర, తోటకూర, కరివేపాకు, ముల్లంగి శ్రేష్ఠం. ఉలవచారు మంచిది.
వేపుళ్ళు, ఇతర నూనె పదార్థాలు, ఉప్పు, పులుపు, కారం తగ్గించాలి.
కాచి చల్లార్చిన నీిని మాత్రమే తీసుకోవాలి.
ప్రతిరోజు వంద గ్రాముల వరకు పళ్ళు తీసుకోవాలి. ప్రొటిన్లు, పీచు, పిండ పదార్థాలు, కాల్షియం, పాస్ఫరస్, ఇనుము, సోడియం, పొాషియం, మాంగనీస్, కెరోటిన్, అస్కార్బిన్ ఆమ్లం, విటమిన్-సి, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి.
ఆకు కూరల్లో ఎంతో అవసరమైన పోషక విలువలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ రక్తహీనతలను నిరోధిస్తాయి కూడా.
ప్రతిరోజూ పాలు, వారానికి మూడుసార్లు కోడిగుడ్డు, ఒకసారి కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
డాక్టర్లు ఎక్కువ కాలరీలున్న ఆహారం తీసుకొవద్దని, భారీ శరీరాన్ని తగ్గించుకోవడానికి విధిగా వాకింగుకు వెళ్ళాలని వ్యాయామం చేయమని హెచ్చరించినా కానీ మన జిహ్వచాపల్యం దాన్ని లక్ష్యపెట్టదు. డై ట్ కొంతవరకే కంట్రోల్ చేస్తుంది.

No comments:
Post a Comment