Monday, August 1

బీర్‌తో మెరిపించండి?


వానాకాలంలో తల తడవకుండా ఉండడం అనేది కష్టమే. తడవాలని కొన్నిసార్లు... అలా అనుకోకపోయినా పరిస్థితుల వల్ల కొన్నిసార్లు తల తడవడం ఖాయం. అలా తడిచి జుట్టు డ్యామేజ్‌ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి...
  • తడిచిన తలతో ఇంటికి వెళ్లగానే మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేసి జుట్టు బాగా ఆరబెట్టాలి. 
  • జుట్టుకు షాంపూని సున్నితంగా రుద్దాలి. అలాగే ఈ సీజన్‌లో తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్‌ వాడడం తప్పనిసరి. 
  • రాత్రుళ్లు గోరువెచ్చటి కొబ్బరి నూనెతో తలకు మర్దనా చేసుకుని దువ్వుకుంటే తల, మాడుకి నూనె సమంగా పరుచుకుంటుంది. 
  • గోరువెచ్చని నూనెలో కరివేపాకులు కలిపి వాడితే జుట్టు మందంగా, నల్లగా ఉంటుంది. 
  • ఈ సీజన్‌లో మాడు దురద పెడుతుంటుంది. అది చుండ్రు లేదా మరేదైనా కారణం వల్ల కావచ్చు. ఇలాంటప్పుడు నీమ్‌ ఆయిల్‌ రాసుకోవడాన్ని మించిన రెమెడీ మరోటి లేదు. 
  • బీర్‌ మంచి కండిషనర్‌. బీర్‌తో జుట్టుని కడిగి కొన్ని నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తుంటుంది. 
  • డ్రయ్యర్‌ వాడకపోతేనే బెటర్‌. డ్రయ్యర్‌కి బదులు పొడి తుండుతో జుట్టును తుడవాలి. 
  • ఈ సీజన్‌లో హెయిర్‌ కలరింగ్‌కి దూరంగా ఉండాలి. అలాగే హెవీ హెయిర్‌ స్టయిల్స్‌ జోలికి వెళ్లొద్దు. సింపుల్‌గా, నేచురల్‌గా ఉంటేనే లుక్‌ బాగుంటుంది.

No comments:

Post a Comment