Thursday, August 4

మీ చర్మం అందంగా ఉండాలంటే…

మనం తినే ఆహారాన్ని బట్టే మన చర్మంలో మెరుపు కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే మీరు తప్పక మీ చర్మానికి తగిన సంరక్షణ ఇస్తారు. ద్రవ పదార్థాలను వీలైనంతగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తులైన మజ్జిగ, లస్సీలను తీసుకోవడం వలన మీ జీర్ణ వ్యవస్థకు ప్రయోజనం ఉంటుంది.
పని ఒత్తిడి చికాకు కోపం, ఫ్రస్ట్రేషన్‌ వల్ల కూడా చర్మ సౌందర్యం తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడం మంచిది. రోజ్‌శాండిల్‌వుడ్‌, లెవెండర్‌ ఆయిల్స్‌ను స్కిన్‌కు ఆప్లై చేయడం వల్ల మీ మైండ్‌, స్కిన్‌ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. రాత్రిపూట త్వరగా పడుకుని త్వరగా లేవడం చర్మం మెరుపు పెరుగుతుంది. మీ బెడ్‌రూంను కూల్‌ ఉంచుకోవడంతో పాటు వెలుతురూ తక్కువగా ఉంచడం వల్ల మంచి నిద్ర వచ్చి శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరుకుతుంది.
ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన చర్మానికి సంరక్షణ కలుగుతుంది. క్యారెట్, ప్రెష్‌ ఫ్రూట్ జ్యూసెస్‌తో పాటు ద్రాక్ష, పుచ్చకాయ, మామిడి, జామ, దానిమ్మ వంటి  పండ్లు తినడం వల్ల చర్మానికి సంరక్షణ కలుగుతుంది.
ఒక టీ స్పూన్‌ కాడ్‌ లివర్‌ అయిల్‌ రోజూ తీసుకోవడం వల్ల మీకు నిత్యం అవసరమయ్యే క్రొవ్వు పదార్థాలు లభిస్తాయి. అంతే కాకుండా ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌తో పాటు కణాలకు జీవకళనిచ్చి శరీరానికి అవసరమైన తేమను, మృదుత్వాన్ని ఇచ్చే విటమిన్‌-ఎ, విటమిన్‌-డిలను పుష్కలంగా ఇస్తుంది. చర్మ సౌందర్యం కోసం ఎక్కువగా మంచినీరు, జూస్‌లు త్రాగడం వలన చర్మం మెరుపు పెరుగుతుంది.
ప్రతిరోజూ కళ్ళు, పాదాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి నీటిలో గాని, రోజ్‌ వాటర్‌లో గాని దూదిని తడిపి పది నిమిషాల పాటు కంటి పై ఉంచుకోవాలి.
చర్మ సౌందర్యానికి చిట్కాలు..
సహజంగా దొరికే తేనె, కొంచెం చక్కెరలను కలిపి ముఖంపై ఆప్లయి చేసుకోవాలి. తేనె, తేమను ఇస్తే, చక్కెర వల్ల సున్నితమైన ముఖచర్మం చిట్లకుండా కాపాడుతుంది. రోజూ ఒక పండును గాని, కూరగాయని గాని మెత్తగా చేసుకుని పెరుగు, తేనె, ఓట్స్  మరియు లెమన్‌ జూస్‌గాని రోజ్‌వాటర్‌ గాని కలిపి ఆ మిశ్రమాన్ని ఇరవై నిమిషాల పాటు ముఖానికి ఉంచుకుని తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మీ చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది.
మీ మొహం కాంతివంతంగా ఉండేందుకు అరటి పండు గుజ్జును మొహానికి రాసుకొని పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే మీ మొహం మృదువుగా తయారవుతుంది.
చర్మం క్లీన్‌గా, మెరుపుతో ఉండడం కోసం కార్న్‌ ప్లోర్‌ తేనెలను సమపాళ్లతో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఆ పేస్ట్‌ను ఉపయోగించి (పూసుకుని) ఒక పావు గంట తర్వాత కడిగి వేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చర్మం మంచి నిగారింపు వచ్చి ఆరోగ్యంగా కనిపిస్తుంది.
ప్రతిరోజూ చర్మాన్ని మెత్తని స్క్రబ్బర్‌తో బ్రష్టింగ్‌ చేయండి ఇలా చేయడం వలన శరీరంలోని మృతకణాలు బయటికి  పోయి చర్మానికి మెరుపు వస్తుంది బ్రష్టింగ్‌ చేసేటప్పుడు చర్మం పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి.

రసాయనాల మిశ్రమంలో తయారయ్యే ఫేస్‌ప్యాక్‌లు హానికరం. అతి సులువుగా దొరికే పదార్థాల మిశ్రమంతో ముఖానికి వేసుకునే ప్యాక్‌ ముఖ చర్మానికి రక్షణను, మెరుపు ఇస్తుంది.

No comments:

Post a Comment