Friday, August 5

తమలపాకుల చరిత్ర.. ప్రయోజనాలు..

మన సంస్కృతిలో తమలపాకును ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే. గణేశ స్థాపనలో, కలశస్థాపనలోను అన్ని పూజలలో తమలపాకులదే అగ్రస్థానం. ఇంటికి వచ్చిన అతిథికి చేసే మర్యాదలలోనూ తమలపాకు తప్పనిసరిగా ఉండాల్సిందే! తమలపాకులను కిళ్ళీలుగా కూడా చాలామంది నములుతూ వుంటారు. ఇంతటి ఘన చరిత్ర గల తమలపాకులో ఎన్నో ఆరోగ్యాలకు సంబందించిన మందులు దాగి ఉన్నాయంటే అతిశయోక్తిగా కనబడ్డ అది అక్షర సత్యం ఆ విశేషాలు కొన్ని మిరియపు జాతికి చెందిన ఈ తమలపాకు మనదేశంలో పుట్టింది. కాదు.. మలేసియా నుండి దిగుమతి అయింది. తీగ జాతికి చెందిన ఈ మొక్క ఉష్ణ దేశాలలో బాగా పెరుగుతుంది.
జీర్ణక్రియ వ్యవస్థను క్రమబద్దికరించి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. భోజనం తరువాత తమలపాకు వేసుకోవటం ఈనాటికి ఎందరికో తప్పనిసరి అలవాటు. తలనొప్పి, పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పులు తమలపాకు వాడితే తగ్గుతాయి. అధిక రక్తస్రావం అరికట్టుతుంది. తమలపాకు కాడలను ఉప్పువేసి దంచి రాసుకుంటే పంటి నొప్పి వెంటనే అరికడుతుందని చైనా థాయ్‌లాండ్‌ దేశాలలో ప్రజలు నమ్ముతారు. తమలపాకు వక్క కలిపి తింటే దగ్గుని అస్తమాని తగ్గిస్తుందని ఇండోనేషియా వాసుల నమ్మిక ఈ తమలపాకులో ‘ఎ’ విటమిన్‌ ఉండటం వలన దీని సేవనం కంటి చూపుకు ఎంతో సహాయ పడుతుంది.
కలకత్తాలో, వారణాసిలో దొరికే తమల పాకులు పెద్దగా ఉంటాయి. దళసరిగా ఉండి మంచి రుచి కలిగి ఉంటాయి. లేత ఆకు పచ్చరంగులో గాని ముదురు ఆకుపచ్చ రంగులో గాని ఉంటాయి. 15 నుంచి 20 సెంటిమీటర్ల పొడువు ఉంటాయి. వీటితో కట్టె కిళ్ళీలు రూపాయి నుండి కొన్నివేల రూపాయల వరకు (ఒకే దానికే) ఉంటుందంటే వీటి సంగతి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాదు. ఆజ్మీరు నగరాల లో ప్రత్యేక కిళ్ళీల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు కొన్ని లక్షల వ్యాపారం జరుగుతుంది. జలుబు, దగ్గుతో చాలకాలం నుండి బాధపడుతున్న వారు రెండు కప్పుల నీళ్ళు వేడిచేసే అందులో 7 తమలపాకులు వేసి తిరిగి మరగకాయాలి. మరిగాక ఒక కప్పు కషాయం తయారయ్యాక తీసుకోవాలి. జలుబు, దగ్గు నయమవుతాయి. అంతేకాదు ఎంతో తేలికగా అయిన భావన వస్తుంది. ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది.

No comments:

Post a Comment