Wednesday, August 3

పాలు, గుడ్లతో మరణం?


వాషింగ్టన్‌: అధిక పోషకాలనందించే పాలు, గుడ్లు, జంతు మాంసం మానవులకు కీడు చేస్తాయా? ఎన్నో ఏళ్లుగా మానవులు వీటిని తమ ఆహారంగా మార్చుకున్నారు. అయితే ఎక్కువకాలం బతకాలంటే మాత్రం వీటిని దూరం చేసుకోవాల్సిందే అంటున్నారు పరిశోధకులు. మసాచుసెట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు. దాదాపు 30 ఏళ్లపాటు 35 లక్షల మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయం బయటపెట్టారు.
పాలు, గుడ్లు, పశుమాంసం (రెడ్‌ మీట్‌) లాంటి జంతు ఉత్పత్తుల వల్ల మరణం దగ్గరవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ‘రెడ్‌ మీట్‌, పాలు, గుడ్లు వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయనే మాట నిజమే. అయితే ఆ ప్రోటీన్లలో చాలా భాగం హాని చేస్తాయి. చాలా రకాల దీర్ఘవ్యాధులు చుట్టుముడతాయి. వీటి కంటే పప్పులు, చిరుధాన్యాలు, పళ్లు, కూరగాయలు మంచి ఆహార పదార్థాల’ని పరిశోధకులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment