Friday, August 26

బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లికి కలిగే లాభాలు...

బిడ్డ పుట్టిన మొదటి ఆరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ఇవి కచ్చితంగా శిశువుకు పట్టాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలను అందుతాయి. ఇందులో మాంసకృతులు, విటమిన్ ఏ ఉంటుంది.
* వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి.
* శిశువు పేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పతాయి.
* తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే.
* బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనే నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు.

బిడ్డకు పాలు పట్టించడం వల్ల తల్లికి కలిగే లాభాల:-

* తల్లులు చనుబాలు ఇవ్వడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.
* చనుబాలు ఇచ్చినందు వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు.
* బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భసంచి క్యాన్సర్లు రావు.
* తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియోపొరొసిన్ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది.
* తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది.
* ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా రోజుకు 8నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి.
* తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు.

తల్లిపాల వలన బిడ్డకు కలిగే లాభాలు:-

* తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి.
* నాణ్యమైన ప్రొటిన్లు, ఒమెగా 3,6 అలాగే 9బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడతాయి.
* ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
* ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి.
* తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటు వ్యాధుల బారినుంచి కాపాడుతాయి.
* బిడ్డ మనోవికాసానికి తోడ్పడుతాయి.
* బిడ్డ మృదువైన మల విసర్జనకు, మలబద్దకం సమస్య నివారణకు తోడ్పడతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి.
* తల్లిపాల ద్వారా బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల బారి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.
* ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు.
* బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే
గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి.
* ఆహారంలో తీపి పదార్థాలు (స్వీట్లు కాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు శుభ్రంగా కడిగిన తర్వాత తినాలి.

No comments:

Post a Comment