అకస్మాత్తుగా గుండెలో ఏదో మంటలా అనిపిస్తుంది. క్షణాల్లో అది ఎడమ ఛాతీకి
వ్యాపిస్తుంది. చెమటలు పడతాయి. కళ్లు తిరిగి పడిపోవచ్చు. మొత్తా నికి తనకు
ఏదో జరుగనుందని, తాను బతకకపోవచ్చని రోగికి అనుమానం వస్తుంది. ఇవన్నీ
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు. వీటిని గుర్తించి, వెంటనే చికిత్స
ప్రారంభిస్తే గుండె పోటు వల్ల సంభవించే మరణాన్ని వీలైనంత మేరకు తగ్గించ
వచ్చు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే క్రమంలో ఆకస్మాత్తుగా రక్తం గడ్డ
కట్టినప్పుడు ఒక ప్రాంతానికి రక్తం ఆగిపోతుంది. అప్పుడు అందులో ఉండే కణాలు
దెబ్బతింయి. దీన్నే గుండెపోటు అంటారు. రక్తం గడ్డ కట్టడానికి కారణం
రక్తనాళాల గోడల్లో నిక్షిప్తమైన కొలెస్ట్రాల్. వయసు పెరిగే కొద్ది ఇది
సాధారణంగా వస్తుంది. మధుమేహం, దూమపానం, రక్తపోటు, ఊబకాయం, వ్యాయామం
లేకపోవడం, లేదా వంశపారంపర్యంగా కొందరికి ఇలాంటివి ఉన్నవాళ్లకు రక్తనాళాల
గోడ లోపల కొలెస్ట్రాల్ అధిక మోతాదులో నిక్షిప్తమై ఉంటుంది. ఇది
అకస్మాత్తుగా చిట్లుతుంది. దీన్ని ప్లేక్ రప్పర్ అంటారు. చిట్లినప్పుడు
కొలెస్ట్రాల్ రక్తంలో కలిసి, రక్తం గడ్డకడుతుంది. కానీ రక్తంలో ఉండే
ప్లేట్ లెట్స్ కు ఒకదానికి ఒకటి అతుక్కునే గుణం ఉంటుంది. రక్తనాళం చ్లినచోట
ప్లేట్ లెట్స్ వచ్చి, అతు కుంటాయీ క్షణాల్లో వందలాది, వేలాది ప్లేట్
లెట్స్ ఒకదానిపై ఒకటి అతుక్కుని రక్తనాళం మొత్తాన్ని బ్లాక్ చేస్తాయి.
ప్లేట్ లెట్స్ లు అతుక్కోవడమే గాక మధ్యలో ఫైబ్రీన్ అనే పదార్థం ఉంటుంది.
ఇది మధ్యలో ఒక వలలాగా ఏర్పడుతుంది. మధ్యలో కణాలు జారిపోకుండా రక్తం
గడ్డలాగా తయారవుతుంది. రక్త ప్రవాహం ఆ గడ్డ వరకే వస్తుంది. దాన్ని దాటి
ముందుకు పోలేదు.
లక్షణాలు:- ఉన్నట్లుండి వెంటనే గుండె నొప్పి వస్తుంది. ఏదో బండరాయి మోపినట్లుగా, మంటలాగా వస్తుంది. కొద్దిక్షణాల్లో ఎడమ ఛాతీకి వ్యాపిస్తుంది. తర్వాత విపరీతమైన చెమటలు రావడం, కళ్లు తిరిగి పడిపోవడం గానీ, ఆయాసంగానీ వస్తుంది. ఏదో జరుగుతోందనే విషయం వారికి అర్థమవుతుంది. బతకకపోవచ్చని భావిస్తారు. గుండె పోటులో ఇది మొది లక్షణం. వయసు పెరిగిన వారిలో, మధుమేహ రోగుల్లో నొప్పి లేకుండా కూడా గుండెపోటు సంభవించవచ్చు. దీనిని సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటాము.
తేడా ఎలా గుర్తించడం..?
గుండె నొప్పికి, గ్యాస్ ట్రబుల్‌కు తేడా గుర్తించడం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్యాస్ ట్రబుల్‌కు సంబంధించి భోజనం చేసిన తర్వాత మంట ఎక్కువగా అవడం లేదా భోజనం చేశాక తగ్గుతుంది. మిగతా సమయాల్లో అంతగా అనిపించదు. గుండెలో నొప్పి పనిచేసినప్పుడు మంట వస్తుంది. చమటలు బాగా వస్తాయి. ఇసిజి తీస్తే కచ్చితంగా గుండె నొప్పిని తెలుసుకోవచ్చు.
ఆలస్యం చేయకూడదు:- గుండె పోటు వచ్చినప్పుడు ఎంత తొందరగా హాస్పిటల్‌కెళితే అంత మంచిది. ఎందుకంటే వెంటనే చికిత్స చేయాలి. ఆలస్యం చేస్తే రక్తం గడ్డకడుతుంది. గడ్డమీద కొత్త ప్లేట్ లెట్స్ అతుక్కోకుండా ఆస్ప్రిన్ టాబ్లెట్స్ ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన తొలి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో ఆలస్యం చేయడం వల్ల 50 శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది.
ప్రథమ చికిత్స:- గుండెపోటు వచ్చిన రోగి మెట్లెక్కడం గానీ, డ్రైవింగ్ గానీ, కదలడం గానీ చేయకూడదు. డిస్ప్రిన్ పేరుతో ఆస్ప్రిన్ టాబ్లెట్స్ దొరుకుతుంది. ఇది చాలామంది తలనొప్పికి వాడే మాత్ర. సర్వసాధారణంగా ఇంట్లో అందరికి తెలిసే ఉంటుంది. దీన్ని వెంటనే ఇవ్వాలి. తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
నిర్ధారణ:- గుండెపోటును నిర్ధారించడానికి చేసే మొదటి పరీక్ష ఇసిజి. తరువాత కొన్ని రక్తపరీక్షలు చేస్తారు. ఆర్వాత యాంజియోగ్రాం చేస్తే ఎక్కడ బ్లాక్ ఉందో తెలుస్తుంది. రక్తంలోని గడ్డను కరిగించడానికి ఒక ఇంజక్షన్ ఇస్తారు. యాంజియోగ్రాం తరువాత వెంటనే స్టింట్ చికిత్స చేస్తారు.
జాగ్రత్తలు:- గుండెపోటుకు చికిత్స తరువాత జీవితాంతం మందులు వాడాలి. బిపి, షుగర్, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో పెట్టుకోవాలి. భోజన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మందులు టైమ్ ప్రకారం వాడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముందు 15 రోజులకు, తర్వాత నెలకు, తర్వాత 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికి గుండె పరీక్ష చేయించు కోవాలి. ఆ తరువాత ప్రతియేడాదికి ఒకసారి చెక్ చేయించుకోవాలి. నాలుగైదేళ్ల వరకు యాంజియోగ్రామ్ అవసరం ఉండదు. కానీ స్టంట్ వేసిన తరువాత ఐదేళ్లకు మళ్లీ ఎంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది. కొత్త సమస్య ఏర్పడితే ముందే గుర్తించవచ్చు. కొవ్వు పదార్థాలు మానాలి. ఎక్కువగా కూరగాయాలు, ఆకు కూరలు, చేపలు తీసుకోవాలి.

No comments:
Post a Comment