Saturday, August 6

కంప్యూటర్‌తో కంటి సమస్యలు..

కంప్యూటర్ల మీద ఎక్కువ పనిచేసే వారికి ఉదయం వేళల్లో మామూలుగానే ఉండి సాయంత్రం అయ్యేసరికి చూపు మసక మసకగా అనిపించవచ్చు. కండ్లు లాగుతున్నట్లు, కళ్లలో నలక పడి గుచ్చుతున్నట్లు, పొడిబారినట్లు అనిపిస్తుంది. అయితే, దృష్టి లోపాల కారణంగా కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకున్న వారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎరుపెక్కడం, కళ్లు లాగడం, కళ్లు దురద పెట్టినట్లు అనిపించడం, ఇవన్నీ వీరిలో కనిపించే కొన్ని లక్షణాలు. ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. దూర ప్రాంతాలను ప్రదేశాలను ఎన్ని గంటలు చూసిన కంటి మీద ఏ ఒత్తిడి పడదు. అదే దగ్గరి వాటిని చూసినప్పుడు కంటి లోని కండరాలు కొద్ది గంటల్లోనే ఒత్తిడికిలోనవుతాయి. మామూలుగా అయితే కళ్లు నిమిషానికి కనీసం 15 సార్లు కళ్లు మూసి తెరచుకుంటూ ఉంటాయి. అయితే కంప్యూటర్‌ మీద పనిచేస్తున్నప్పుడు తదేకంగా స్క్రీన్‌వైపు చూడటం వల్ల కళ్లు కేవలం నాలుగైదు సార్లకు తగ్గిపోతుంది. ఇలా కళ్లు కొట్టుకోవడం తగ్గిపోవడం వల్లను గుడ్డుమీద ఉండే సన్ని నీటి పొర ఆవిరైపోతుంది. దీనితో కన్నుపోడి బారిపోతుంది. కంప్యూటర్లు ఉండే ప్రదేశాలు ఎయిర్‌ కండిషన్‌తో ఉంటాయి. ఇది కూడా కంటి లోని నీరు త్వరగా ఆవిరి కావడానికి కారణమవుతుంది. కంప్యూటర్‌ మీద పనిచేస్తన్నప్పుడు ఒత్తిడి ఏర్పడానికి కూడా దగ్గరితనమొక కారణమవుతుంది. ఈ స్థితిలో గంటల పర్యంతం కంప్యూటర్‌ మీద పనిచేయడం వల్ల కళ్లు ఒత్తిడికి లోనవుతాయి. కంప్యూటర్‌ వినియోగంలో కలిగే ఇబ్బందులన్నీ ఆ ఒత్తిడి వల్లే తప్ప కంప్యూటర్‌ వల్ల కాదు.
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేశాక ఏడెనిమిది గంటలు నిద్రపోతే ఈ సమస్యలన్నీ మటుమాయమ వుతాయి. అంతే తప్ప ఆ సమస్యలు మరుసి రోజుకు కొనసాగవు. అందుచేత, సమస్య క్రమంగా పెరుగుతూ పోవడం ఉండదు. ఏ రోజుకు ఆరోజు తమను తాము చక్కదిద్దుకునే శక్తి కళ్లకు సహజంగానే ఉంటుంది. అవసరమైన మేరకు నిద్ర ఉంటే మరుసి రోజు సంపూర్ణ శక్తి చేకూరుతుంది. నిద్ర తక్కువ ఉండేవారిలో మాత్రం ఈ సమస్యలు మరుసటి రోజుకు కొనసాగవచ్చు. ఏకంగా రెండు షిఫ్టులలో పనిచేసే వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. మాటి మాటికి షిఫ్టులు మారే వారిలోనూ ఆ సమస్యలు కనిపిస్తాయి.


కంప్యూటర్‌ మీద గంటల పర్యంతం విరామం లేకుండా పనిచేసేనప్పుడే సమస్యలు వస్తాయి. ప్రతి పదిహేను నిముషాలకు కంప్యూటర్‌ నుంచి దృష్టి మరల్చి వీలైనంత దూరంగా ఓ 20 సెకన్ల పాటు అలా చూస్తూ ఉండిపోవాలి. నాలుగైదు సార్లు కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటి కండరాలు నుంచి ఉపశమనం పొందుతాయి. అంతకు ముందు 15 నిముషాలకు కంప్యూటర్‌ నుంచి దృష్టి మరల్చి వీలైనంత దూరంగా ఓ 25 సెకన్ల పాటు అలా చూస్తూ ఉండిపోవాలి. నాలుగైదు సార్లు కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కండరాలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాయి. అంతకుముందు పదిహేను నిముషాల్లో కలిగిన ఒత్తిడి, దాని తాలూకు ఇబ్బంది తొలగిపోతాయి. ఇలా చేస్తూ ఉంటే రోజు 10 గంటలు పనిచేసినా ఏ ఇబ్బందీ ఉండదు. కంప్యూటర్‌ స్క్రీన్‌ సెంటర్‌ మన కంటికి ఐదు అంగుళాలు కిందికి ఉండాలి. ఒకవేళ కళ్ల కన్నా ఎత్తుగా కంప్యూటర్‌ ఉంటే కళ్లను పైకెత్తి చూడవలసిరావచ్చు. దీనివల్ల కంటి లోని నీరు తొందరగా ఆరిపోయే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్‌లు వాడే వారైనా లేదా ముందు నుంచే కళ్లు పొడిబారే తత్వం ఉన్నవారు ఒక చిన్న జాగ్రత్త వహిస్తే చాలు. మెడికల్‌ షాప్‌లో దొరికే లూబ్రికిేంగ్‌ ఐ డ్రాప్స్‌ రోజుకు నాలుగైదు సార్లు వేసుకోవడం మేలు. వేసుకున్న వెంటనే తుడిచేస్తే కళ్లు మసకబారడం కూడా ఉండదు వేరే కంటి జబ్బులు ఉండే వాటి కోసం చికిత్స తీసుకోవాలే తప్ప సమస్యనూ కంప్యూటర్‌కు ఆపాదించడంలో అర్థం లేదు. కేవలం కంప్యూటర్‌ వల్ల వచ్చే సమస్య అంటూ ఏదీ లేదు. ఆ కారణంగా చికిత్స కోసం వెళ్లవలసిన అవసరం లేదు. దృష్టిలోపం ఉంటేనే కళ్లజోడు వాడాలి..

No comments:

Post a Comment