క్షయరోగి మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే గాలి తుంపరల ద్వారా చుట్టుపక్కల వారికి సంక్రమిస్తుంది.
వ్యాధి లక్షణాలు :-
నూటికి నూరుపాళ్ళు క్షయను నయం చేయవచ్చు. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, కచ్చితమైన వైద్యం, కనీసం ఆరు నెలల పాటు నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే చాలు. ఈ వ్యాధిని తగ్గించే మందులు దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న డాట్స్ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చును.
నిర్లక్ష్య ధోరణి ప్రాణాంతకం :-
ఖచ్చితమైన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మానవ నిర్లక్ష్య ధోరణితోనే భయంకరమైన వ్యాధిగా, మందులకు లొంగని ప్రాణాంతక వ్యాధిగా మారింది. మందులు సక్రమంగా వాడక పోవడం, మధ్యలోనే మానేయడం కారణంగానే ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాలను హరిస్తుంది.
భయపెడుతున్న లెక్కలు :-
ప్రపంచంలో ప్రతి ఏటా 9 మిలియన్ల మంది క్షయబారీన పడుతున్నారు. అందులో సుమారు మూడొంతల మంది మనదేశంలో ఉన్నారు.
భారతదేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టిబి వ్యాధి సోకుతుంది. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు.
2013 గణాంకాల ప్రకారం సంవత్సరానికి మూడు లక్షల మంది టిబి రోగులు మరణిస్తున్నారు.
ప్రతి రోగి తాను చనిపోయే లోపు లేదా చికిత్స పూర్తి అయ్యేలోపు 15 – 25 మందికి ఈ వ్యాధిని వ్యాపింప చేస్తున్నారు. టిబి వ్యాధిని నిర్లక్ష్యం చేయడం అంటే 15-25 మందిని హత్య చేయడమే.
సంతానలేమితో బాధపడుతున్న చాలామందిలో గర్భాశయ టిబి సోకుతుంది.
చేయాల్సినవి :-
వ్యాధి లక్షణాలు :-
- రెండు వారాలు లేక అంతకుమించి దగ్గు రావడం.
- సాయంత్రం లేదా రాత్రిపూట జ్వరం రావడం.
- బరువు తగ్గడం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండడం.
నూటికి నూరుపాళ్ళు క్షయను నయం చేయవచ్చు. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ, కచ్చితమైన వైద్యం, కనీసం ఆరు నెలల పాటు నిర్ణీత సమయంలో క్రమం తప్పకుండా మందులు వాడితే చాలు. ఈ వ్యాధిని తగ్గించే మందులు దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న డాట్స్ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చును.
నిర్లక్ష్య ధోరణి ప్రాణాంతకం :-
ఖచ్చితమైన మందులు అందుబాటులో ఉన్నప్పటికీ మానవ నిర్లక్ష్య ధోరణితోనే భయంకరమైన వ్యాధిగా, మందులకు లొంగని ప్రాణాంతక వ్యాధిగా మారింది. మందులు సక్రమంగా వాడక పోవడం, మధ్యలోనే మానేయడం కారణంగానే ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ప్రాణాలను హరిస్తుంది.
భయపెడుతున్న లెక్కలు :-
ప్రపంచంలో ప్రతి ఏటా 9 మిలియన్ల మంది క్షయబారీన పడుతున్నారు. అందులో సుమారు మూడొంతల మంది మనదేశంలో ఉన్నారు.
భారతదేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టిబి వ్యాధి సోకుతుంది. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు.
2013 గణాంకాల ప్రకారం సంవత్సరానికి మూడు లక్షల మంది టిబి రోగులు మరణిస్తున్నారు.
ప్రతి రోగి తాను చనిపోయే లోపు లేదా చికిత్స పూర్తి అయ్యేలోపు 15 – 25 మందికి ఈ వ్యాధిని వ్యాపింప చేస్తున్నారు. టిబి వ్యాధిని నిర్లక్ష్యం చేయడం అంటే 15-25 మందిని హత్య చేయడమే.
సంతానలేమితో బాధపడుతున్న చాలామందిలో గర్భాశయ టిబి సోకుతుంది.
చేయాల్సినవి :-
- ప్రతి వ్యక్తి ఈ క్షయ మహమ్మారి గురించి ప్రాథమిక విషయాల్ని కచ్చితంగా తెలుసుకోవాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక స్పృహ పెరగాలి. బహిరంగ ప్రదేశాల్లో తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు ఉపయోగించాలి.
- వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
- డాక్టర్లు చెప్పినట్లు మందులు క్రమం తప్పకుండా కనీసం ఆరు నెలలు వాడాలి.
- మందులు వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ (వాంతులు, కామెర్లు లాంటివి) వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి. మందులు మాత్రం ఆపవద్దు.
- బలవర్ధకమైన పోషకాహారం తీసుకోవాలి. పొగ త్రాగడం, మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
- క్షయ రోగులకు మందులతో పాటు అవగాహన కల్పించేలా డాక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వాలి.
ప్రభుత్వం డాట్స్ కేంద్రాల్లో అందిస్తున్న ఉచిత సేవలు, మందుల పంపిణీ గురించి ప్రచారం కల్పించాలి.
No comments:
Post a Comment