Tuesday, August 2

మూత్ర పిండాలలో రాళ్ళు..

మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం వల్ల తీవ్రమైన నొప్పికలుగుతుంది. ఈ నొప్పి తుంటి ఎముకల వైపు నుంచి ఏర్పడుతుంది. ఆ తర్వాత పొత్తి కడుపుకూ, తొడల మధ్య భాగం వరకూ వ్యాపిస్తుంది. మూత్రపిండాలు లేదా మూత్రాశయంలో ఉన్న రాళ్ళను బయటకు నెట్టి వేసే ప్రయత్నం జరుగుతుంది. దానికి అనుగుణంగా, కండరాలు ఎక్కువగా సంకోచిస్తాయి. అప్పుడు భరింపలేని నొప్పి వస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడ టా నికి కారణమేమిటని ముందుగా తెలుసుకోవాలి. ఆరోగ్యానికి తీసుకునే ఔషదాలు, ఆహారపదార్థాలలోని కాల్షియం ఆక్స లేట్ , కాల్షియం ఫాస్ప్‌ట్ లవణాలు మూత్రపిండాలలో చేరి రాళ్ళను ఏర్పరుస్తాయి. అవి మూత్రాశయంలోకి చేరుకుంటాయీ. మూత్రాశయంలో రాళ్ళు నిలువ ఉండటం వల్ల తీవ్రమైన నొప్పి రావడం, మూత్ర విసర్జన సమయంలో బాధ కలగటం జరుగుతుంది. శరీరానికి కావలసినంత నీటిని దేహానికి అందివ్వక పోవడం, స్వేదం అధికంగా విసర్జింప బడటం వల్ల మూత్రనాళం, మూత్రాశయం ఇన్‌ఫెక్షనుకు గురయినప్పుడు కూడా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడుతాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడానికి కారణాలను తెలుసుకున్నప్పుడు, రాళ్ళు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల వరకూ పరిశుభ్రమైన నీటిని త్రాగాలి. మూత్రం గాఢత చెందకుండా మూత్రం ద్వారా రాళ్ళు బయటకుపోయేలా ఎక్కువ నీటిని త్రాగడం అవసరం. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడిబాధ కలుగుతుంటే వైద్యునికి చూపించుకోవాలి. నొప్పిని తగ్గించు కోవానికి వైద్య సలహాలను పొందాలి. వైద్యుడు మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడిన కారణంగా ఆ నొప్పి వస్తున్నదని నిర్ధారణ చేసిన తర్వాత, నొప్పిని తగ్గించ టా నికి మందులను ఇవ్వవచ్చు. అంతేకాకుండా, మూత్రపిండాలలోని రాళ్ళ పరిమాణాన్ని గుర్తించి, రాళ్ళ పరిమాణం చిన్నదిగా ఉంటే, ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం ద్వారా, మంచి నీటి ని ఎక్కువగా త్రాగటం ద్వారా, మూత్రవిసర్జన పెరిగి, మూత్రం ద్వారా రాళ్ళు తొలిగి పోయేలా చేస్తాడు. రాళ్ళ పరిమాణం పెద్దదిగా ఉంటే, హైఫ్రీక్విన్సితో శబ్ద తరంగాలను పంపి, ఆ వైద్యవిధానం ద్వారా వాటిని చిన్నవి చేసి, ఆ తర్వాత రాళ్ళ విసర్జన మూత్రం ద్వారా జరిగే చర్యను చేపట్టవచ్చు. ఒక్కొసారి, రోగికి శస్త్ర చికిత్సను చేసి, రాళ్ళను తొలగించవలసి ఉంటుంది. మూత్ర విసర్జనా సమయంలో బాధకలుగుతున్నప్పుడు, పొత్తి కడుపు, తుంటి ఎముకలు, వెన్ను పూసల ప్రాంతాన నొప్పి ఏర్పడి, ఆ నొప్పి తీవ్రమై తొడలవరకూ వ్యాపించినప్పుడు ఎంత మాత్రం అశ్రద్ధ చేయకుండా నీటిని ఎక్కువగా త్రాగడం, ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవటమే కాకుండా, వైద్యునికి చూపించుకుని, అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మూత్రం గాఢత చెందినప్పుడు, శరీరానికి అధికంగా నీళ్ళు అందించాలన్న విషయాన్ని పాటించాలి. మూత్రశాయం, మూత్ర నాళాలు, మూత్రపిండాలు ఇన్‌ఫెక్షనుకు గురవకుండా కాపాడు కోవాలి. వైద్య సలహాలను పాటించి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

No comments:

Post a Comment