Tuesday, August 2

‘తులసి’తో ఆరోగ్యం

1) తులసి రసంలో పంచదారను కలిపి ప్రతిరోజూ సేవిస్తే చాలా రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి.
2) తులసి రసాన్ని క్రమం తప్పకుండా సేవిస్తున్న స్త్రీలలో అధిక రుతుస్రావం తగ్గుతుంది.
3) తులసి రసంలో తగు మోతాదులో శొంఠి, అల్లం కలిపి సేవిస్తే కడుపు నొప్పి తగ్గుతుంది.
4) తులసి రసానికి నిమ్మరసాన్ని చేర్చి పై పూతగా ఉపయోగిస్తే గజ్జి తదితర చర్మవ్యాధులు తగ్గుతాయి.
5) తులసి ఆకులతో కషాయాన్ని కాచి ప్రతిరోజూ ఉదయమే పరగడుపున సేవిస్తే చాలా రకాల వ్యాధులు, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
6) తులసి పత్రాల రసంలో అల్లపు రసం, తేనె కలిపి సేవిస్తే మలబద్దకం తగ్గి ఆకలి పెరుగుతుంది.
7) కృష్ణతులసి పత్రరసంలో తేనెను కలిపి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
8) తులసిలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే లక్షణం కూడా ఉంది. అంతేకాక మూత్రపిండాల వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
9) తులసి జీర్ణక్రియకు దోహదపడి ఆకలి పెంచుతుంది
10) శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంచి జలుబు, బ్రాన్కైటీస్ శ్వాసకోస సమస్యలను తగ్గిస్తుంది.

11) తులసి జ్ఞాపకశక్తి, చురుకుదనం పెంచుతుంది.
12) క్యాన్సర్‌ కార ఫ్రీరాడికల్స్‌ తొలగింపులో కూడా తులసి దోహదపడుతుంది.
13) తులసిలో యాంటి ట్యూబర్‌క్యులర్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి వైరల్‌ గుణాలున్నాయి.
14) మెటబాలిక్‌ వ్యవస్థను పటిష్ట పరచి, రక్తంలో హానికర రసాయనాలను వెలికి నెట్టడం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్సగా తులసి పనిచేస్తుంది.
15) శారీరక, మానసిక ప్రతికూలతలను నియంత్రించి టెన్షన్లను తగ్గిస్తుంది.
16) తులసి ఆకులు, మిరియాలు దంచి బాగా మరిగించి కషాయం తయారు చేసి రెండు చెంచాలు చొప్పున త్రాగితే జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.
17) తులసి ఆకులను ఎండ బెట్టి , మెంతులు, అశ్వగందను కలిపి పొడిచేసి దీనిని పాలతో కలిపి కొద్దిమోతాదులో ప్రతిరోజు తీసుకుంటుంటే వీర్యవృద్ధి కలుగుతుంది. ఇటు వంటి ఎన్నో ఉపయోగాలను తులసి కలిగిస్తుంది.

No comments:

Post a Comment