Thursday, August 4

ఎన్నో ఉపయోగాలు ఉన్న ముద్ద ముందారం..!

    ప్రకృతిలో మనకు కనువిందు చేసే ఎన్నో రకాల పూలు కనిపిస్తుంటాయి. అతివ సిగలో ఎంతో అందంగా ఒదిగి ఒయ్యారాలు పోతుంటాయి. దైవార్చనకు, అభినందనలకూ, అశుతాంజలికి ఇలా ఒకేటేమి అనేక రకాలుగా పూలు మన జీవితంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాటిలో ఒకటి మందారం ఇది బాహ్య సౌందర్యానికి మాత్రమే కాకుండా శారీరక, ఆరోగ్య, కేశ సంరక్షణ కోసం ఎంతగానో ఉపయోగపడే బహుళ ప్రయోజనకారి. దీని కొమ్మలు, ఆకులు, పూలు, బెరడు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందుల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. దీంతో మనుషులు ఆరోగ్యంగా వుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
    ఆరోగ్య సంరక్షిణిగా.. ముఖ్యంగా యునాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది శరీరం లో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, మధుమేహం, రక్తపోటు, మూత్ర పిండాలు, గొంతుకు సంబంధిం చిన వ్యాధుల నివారణకు దివ్యౌ షధంగా పని చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.
     ఇందులో ‘సి’ విటమిన్‌, కాల్షియం, పీచు పదార్థం (ఫెబర్‌), ఐరన్‌, నైట్రోజన్, పాస్పరస్‌, టెటరిక్‌ ఆక్సాలిక్‌ యాసిడ్‌, ప్లేవోనైడ్‌, గ్లెకోసకైడ్‌ తగు మోతాదులో లభిస్తాయి. మందార వేర్లను శుభ్రంగా కడిగి అంగుళం పొడవుండేలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక్కో ముక్కను నోట్లో పెట్టుకొని చప్పరించి రసాన్ని ఉమ్మి వేస్తుండాలి. ఇలా రెండు, మూడు రోజులు చేస్తే నోటిలో పుండ్లు తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం పూటకు నాలుగేసి మందార పువ్వుల చొప్పున రెండు సంవత్సరాలు తింటే తెల్ల మచ్చలు తగ్గుతాయి. మందార పూల మొగ్గను నెయ్యిలో వేయించి పిక బెల్లాన్ని, నాగ కేశరాలనూ కలిపి ముద్దగా నూరి ప్రతిరోజూ ఉదయం, సాయంకాలం తీసుకుంటూ ఉంటే రక్త స్రావంతో కూడిన అర్షమొలలు తగ్గుతాయి.
     మధుమేహం వ్యాధి ఉన్నవారిలో బ్లడ్‌షుగర్‌ నియంత్రణలో లేనివారు ప్రతిరోజు 2,3 మందార మొగ్గలను (10-20) గ్రాముల మోతారు ముద్దగా నూరి తీసుకుంటూ 10-15 రోజుల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మందార పువ్వులు నేతిలో వేయించి తినడం వలన రక్త విరోచనలు తగ్గుతాయి.
    కేశ సంరక్షణ కోసం.. ముఖ్యంగా కురుల సంరక్షణలో పరిశుభ్రత అవసరం పెను కొరుకుడు, బట్టతల కలవారు ఈ పువ్వులను రుద్దడం వలన వెంట్రుకలు మరల పెరుగు తాయి. ఈ పూలు వేడి చేసి కొబ్బరి నూనెతో తలకు పట్టించడం వలన వెంట్రుకలు రాలి పోవడం ఆగుతుంది. మందార ఆకులను పేస్ట్‌గా చేసి తలకు పట్టిస్తే శిరోజాలు మృదువుగా ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని హరిస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది.
     మందార పువ్వులను మెత్తగా నూరి రసం పిండి, ఆలివ్‌ నూనెకు కలిపి కేవలం నూనె మాత్రమే మిగిలేంత వరకూ చిన్నమంట మీద మరగించి నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ కేశాల కుదుళ్ళకు పెట్టి సున్నితంగా మర్థనా చేసుకుంటే కేశాలు దృఢంగా, ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి.
అనేక కారణాల వలన కొందరి జుట్టు చిన్న వయసులోనే నెరసిపోతుంది. ఇలాంటి వారికి చక్కని పరిష్కారం మందారంతో లభిస్తుంది. ముందురోజు రాత్రి పెరుగులో నాలుగు చెంచాల మందార పొడి సరిపడేంత గోరింటా పొడిని వేసి నానపెట్టాలి. ఉదయాన్నే కోడి గుడ్డులోని తెల్లసోన, చెంచా ఇన్స్ స్టంట్ కాఫీపొడిని కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తరువాత గోరు వెచ్చని నీటితో రోజులో ఒకసారి చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.
    స్త్రీల ఋతుసమస్యలకు.. మందార పువ్వుతో జపా పుష్పావలేహ్యం తయారు చేసుకుని వాడితే మహిళలను తరచూ ఇబ్బంది పెట్టే రుతు సంబంధ సమస్యల నుంచి ఉపశ మనం లభిస్తుంది. మందార పూలను గంజి తోనూ బెల్లంతోనూ కలిపి మెత్తగా నూరి బహిష్టు తరువాత మూడు రోజుల పాటు వరుసగా తీసుకుంటే గర్భ నిరోధకంగా పనిచేస్తుంది.
     4-5 మందార మొగ్గలను నెయ్యిలో వేయించి పంచదార కలిపి తీసుకుంటూ పాలు తాగాలి. దీనిని వారం పాటు చేస్తే తెల్ల బట్ట సమస్య ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది.
     అమ్మవారి పూజ కోసం.. మందార పూలను దేవతలకు అర్చనగా ఉపయోగిస్తారు. ఎర్రి పువ్వులను ముఖ్యంగా అమ్మవారికి అర్పిస్తారు.

No comments:

Post a Comment