Saturday, August 13

అల్లం నీటితో కొవ్వు ఎలా కరుగుతుందో తెలుసా..!

చాలా మంది చాలా లావుగా ఉన్నామని భాధపడుతుంటారు.ఎక్కువగా నడుము,పిరుదులు,తొడలు చుట్టూ కొవ్వు పేరుకుని ఉండడం తో చూడడానికి చాలా అసహ్యం గా ఉంటుంది.ఇక వీటన్నిటికి అల్లం ఒక చక్కటి పరిష్కారం. ప్రతి ఇంట్లో వంటల్లో అల్లం ని వాడడం సహజం ,ఒక్క అల్లం లొనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వలన అనారోగ్యాల నుంచి కాపాడుతుంది అంతేకాకుండా కొవ్వుని తొందరగా కరిగించడంలో సహయపడుతుంది.
అల్లం లో ఉండే జింజిరాల్ అనే పదార్ధం వలన శరీరంలోని అధిక నీటిని బయటకు పంపడానికి సహయ పడుతుంది.అలాగే పొట్టలో పీహెచ్ లెవెల్స్ పెంచడంలోనూ అల్లం సహాయపడుతుంది.జీర్ణక్రియ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలా పొట్టలో బ్లోటింగ్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. అలాగే అల్లం మెటబాలిక్ రేట్‌ని శరీరంలో పెంచడానికి సహాయపడుతుంది.
మెటబాలిజం పెరిగితే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అల్లం వాటర్ తయారుచేసే విధానం:- 

ఒక లీటర్ నీటిని తీసుకుని ఉడికించాలి. ఒక ముక్క అల్లం తీసుకుని శుభ్రం చేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మరుగుతున్న నీటిలో కలపాలి. మరో 5 నుంచి 10 నిముషాలు ఉడికించాలి. ఆ నీటిని చల్లార్చి, వడకట్టి, తాగాలి. ఈ నీటిని రోజంతా మామూలు నీళ్లు తాగినట్టుగా తాగాలి. మూడు నాలుగు నెలలు క్రమం తప్పకుండా తాగడం వల్ల మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని గమనిస్తారు. తొడలు, పిరుదులు, నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కరుగుతూ ఉంటుంది. అల్లం వాటర్‌ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. అయితే ఏ రోజుకి ఆ రోజు అల్లం వాటర్ తయారుచేసుకుని తాగడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతారు.

No comments:

Post a Comment