Saturday, April 1

వడదెబ్బ తగలకుండా...

ఎండలు మండుతున్నాయి. వేసవి తాపానికి జీవరాసులన్నీ విలవిలలాడుతున్నాయి. ఎండాకాలం వచ్చిందంటే వడదెబ్బ తగలడం పరిపాటి. శరీరంలో నీరు తగ్గిపోవడం, డీహైడ్రేషన్‌ కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. వేసవిలో వచ్చే జబ్బుల్లో వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైనది. శరీరంలో ఎప్పుడైతే నీటి శాతం తగ్గిపోతుందో అప్పుడు, ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. అటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎక్కువ సమయం ఎండలో ఉండటం వల్ల శరీరంలో కొన్ని అవయవాలు చెడిపోతాయి కూడా. ముఖ్యంగా వడదెబ్బకు గురైన వ్యక్తిలో శ్వాస సమస్యలు, తలనొప్పి, అబ్‌ నార్మల్‌ హార్ట్‌ రేట్‌, వికారం, చర్మం ఎర్రగా మారడం, ఎక్కువ చెమట పట్టడం, కండ్లు తిరగడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
వడదెబ్బకు గురికాకుండా చిట్కాలు పాటిస్తే మంచిది...
ఉల్లిపాయ రసం : వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించడానికి ఇదెంతో దోహదపడుతుంది. ఉల్లిపాయ రసాన్ని ఛాతీకి, వీపు భాగానికి రాయడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. అంతేకాదు.. పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో సలాడ్స్‌లా తీసుకోవడం వల్ల ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందొచ్చు.
చింత నీళ్లు: చింత పండును నీళ్లలో వేసి ఆ గుజ్జును 10 నిమిషాలపాటు వేడి చేయాలి. గోరువెచ్చగా ఉన్న ప్పుడు ఆ నీటిని తాగాలి. చింత గుజ్జులో వివిధ రకాల మినిరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌, విటమిన్స్‌ అధికంగా ఉంటాయి. శరీరంలో ఉష్ణోగ్రతను ఇవి తగ్గిస్తాయి.
ముంజలు : వేసవిలో వీటిని తినడం చాలా మంచిది. శరీరాన్ని ఇవి హైడ్రేట్‌ చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్‌ని అందిస్తాయి. మొదట ముంజలను నీళ్లలో నానబెబట్టి అవి మెత్తగా మారిన తర్వాత ఆ నీళ్లు సహా తీసుకోవడం మంచిది.
కొబ్బరి నీరు : ఎండా వేడి నుంచి కొబ్బరి నీరు ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో సాధ్యమైనంతగా దీన్ని తీసుకుంటే మంచిది. శరీరాన్ని హైడ్రేట్‌ చేయడంతోపాటు మినిరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ని ఇది అందిస్తుంది.
కొత్తిమీర, పుదీనా జ్యూస్‌ : కొత్తి మీర, పుదీనా కాంబినేషన్‌లో ఒక గ్లాసు జ్యూస్‌ని వేసవిలో రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఈ జ్యూస్‌ శరీరాన్ని కూల్‌గా మారుస్తుంది.
యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌: గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కలిపి తాగాలి. ఇలా ఎండ వేడికి శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌, మినిరల్స్‌ తిరిగి పొందడానికి ఇది దోహదపడుతుంది.
గంధం పేస్ట్‌ : వేసవిలో శరీర వేడిని తగ్గించేందుకు గంధం అదు ్భతంగా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చాక నుదుట, ఛాతీ వద్ద కొద్దిగా దీన్ని అప్లై చేస్తే వడదెబ్బ నుంచి ఉపశమనం పొందొచ్చు.

No comments:

Post a Comment