చంటి పిల్లలకు స్నానం చేసిన వెంటనే
బేబీ పౌడర్ వేస్తారు. బేబీ పౌడర్‌ను వేసేప్పుడు అనుకోకుండా కాస్త ఎక్కువ
పడితే వృథాగా కింద పడేస్తారు. కిందపడిన ప్రతి సారి ఆందోళనపడాల్సిన అవసరం
లేదు. కింద పడిన బేబీ పౌడర్ వల్ల ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి.
అవేంటో తెలుసుకుందాం...
- బూట్లు చాలా పాతగా ఉంటే... వేసుకోవాటానికి కూడా చిరాకుగా అనిపిస్తుంది. షును ప్రతిరోజూ కడగలేరు కదా... అందుకే షు లోపలి భాగంలో బేబీ పౌడర్‌ను చల్లుకోవటం మంచిది. దీని వల్ల చెడు వాసన మటుమాయం అవుతుంది.
- బీచ్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఒక చిన్న డబ్బాలో బేబీ పౌడర్‌ను వేసుకొని తీసుకెళ్లండి. ఎందుకంటే బీచ్ నీటిలో ఆడుకొని బయటకు రాగానే చర్మం చాలా జిడ్డుగా, గరుగ్గా తయారవుతుంది. ఆ జిడ్డు తొలగిపోవాలంటే బేబీ పౌడర్ ముందుగా శరీరానికి పట్టించి తర్వాన స్నానం చేస్తే ఉక్కపోత, జిడ్డుతత్వం రెండు తొలగిపోతాయి.
- తల స్నానం చేసిన జుట్టు నిర్జీవంగా, జిడ్డుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో జుట్టు చివర్లకు బేబీ పౌడర్‌ను చేతిలో వేసుకొని నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది. పౌడర్ జిడ్డుతత్వాన్ని తొందరగా పీల్చుకుంటుంది.
- పెదాలకు లిప్‌స్టిక్ తొందరగా పోతుందా... అయితే ఇలా చేయండి. ముందుగా ఒక సారి లిప్‌స్టిక్ పెట్టుకొని దానిపై కొంచెం బేబీ పౌడర్ చల్లుకొని తర్వాత డబుల్ కోట్ వేసుకుంటే లిప్‌స్టిక్ ఒక గంటపాటు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది.
No comments:
Post a Comment