Sunday, April 16

నిమ్మరసం ఆరోగ్య ఫలం...

నిమ్మరసం తాగడం ఈ వేసవి సీజన్‌లోనే కాదు. ఇతర సమయాల్లో కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు...
  • నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ రసం, కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం మంచిదే.
  • నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
  • అజీర్ణంతో బాధపడేవారు కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే, అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది.
  • నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.
  • వయసు పెరుగుతుండడం వల్లే వచ్చే చర్మం ముడుతలను నిమ్మరసం కొంతవరకు నిరోధిస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ వంటివాటిని నివారిస్తుంది.
  • పన్ను నొప్పితో బాధ పడేవారు కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టినచోట పెడితే ఉపశమనం లభిస్తుంది.
  • పళ్ల నుంచి రక్తం కారుతున్నా, నోటినుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మరసం వాటిని దూరం చేస్తుంది.
  • నిమ్మరసం, నీరు కలిపి పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బందిపెట్టవు.
  • నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా ఉండడం, ఒత్తిడిని దూరం చేస్తుంది నింబూ పానీ. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడేవారికి నిమ్మ మంచి ఔషధం.

No comments:

Post a Comment