Saturday, April 29

సీసా పాలతో పిల్లలకు కలిగే నష్టాలు మీకు తెలుసా..?

తల్లి పాలు పిల్లలకు ఎంతో శ్రేయోస్కరం.. ప్రసవానంతరం తల్లులు తమ పిల్లలకు పాలు రానప్పుడు సీసాతో పాలు పట్టిస్తుంటారు.. కానీ అదెంత ప్రమాదకరమో వారికి తెలియదు.. సీసా పాలకు, తల్లి పాలకు ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి.. పుట్టిన ప్రతి బిడ్డకీ తల్లిపాలు తప్పకుండా యివ్వాలి. తల్లిపాలలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. బిడ్డకు కనీసం 1 సంవత్సరం వరకైనా తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి.. సీసా పాలు త్రాగించటం వలన చాలా నష్టాలున్నాయి.
పిల్లలు సీసా పాలకు అలవాటు పడటం పిల్లలకు మంచిది కాదు.. మరియు తల్లులకు మంచిది కాదు పిల్లలకు పాలు పట్టడం వలన తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది..
సీసాను నిటారుగా కాకుండా అడ్డంగా పట్టుకొన్నట్లయితే శిశువు పాలతోపాటు గాలిని కూడా పీల్చటం వల్ల కడుపు సగం గాలితో నిండిపోతుంది.. కడుపులో గాలి ఎక్కువగా చేరటం వల్ల కడుపునొప్పి రావచ్చు.
సీసాను మనం నోట్లో పెట్టడం వలన అది ఏమాత్రం కాస్త పక్కకు జరిగిన ముక్కులోకి పాలు పోయి అది కాస్తా ఊపిరితిత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంది..
సీసాలో పాలు త్రాగించే ముందు సీసాను ప్రతిసారి ‘స్టెరిలైజ్‌’ చేయాలి. అలా చేయకపోవడం వల్ల దానికి అంటుకొని వున్న బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల బిడ్డకు వివిధ రకాలైన వ్యాధులు రావచ్చు.
ఒకసారి సీసా పాలకు అలవాటు పడిన పిల్లలు తల్లిపాలపై ఆసక్తి తగ్గడం వల్ల పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది.
బిడ్డను నిద్ర పుచ్చటానికి కొందరు తల్లులు రాత్రి సమయాల్లో సీసా అందిస్తారు. దీనివల్ల రాత్రంతా నోట్లో పాలు నిలిచిపోయి వాటి నుండి బాక్టీరియా, సూక్ష్మ జీవులు తయారై దంతక్షయానికి దారి తీస్తుంది.
సీసా పాల వల్ల తల్లి, బిడ్డ అనుబంధం ప్రకృతి సిద్ధంగా తగ్గే అవకాశం ఉంది. సీసా నోటికిచ్చి తల్లి తన పని తను చేసుకుంటూ వుంటే ఇద్దర మధ్య సంబంధం బాంధవ్యాలు లోపించే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందట..
దీర్ఘకాలం సీసాతో పాలు త్రాగడం వల్ల దంతాలు కూడా ఎగుడుదిగుడుగా వస్తాయి.
సీసాతో పాలు త్రాగే పిల్లలకు ఎన్ని పాలు సరిపోతున్నాయో అన్న విషయంపై అవగాహన లేకపోవడంతో అవసరానికి మించి పాలు త్రాగించడం వలన స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువ.

No comments:

Post a Comment