Tuesday, April 11

అరటిపండ్లతో గుండె పదిలం...

అరటిపండ్లతో హార్ట్‌ఎటాక్‌ని అరికట్టొచ్చట! బ్రిటీష్‌-ఇటాలియన్‌ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజుకు కనీసం మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్‌ పెట్టొచ్చని తేల్చారు. రోజూ ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్ర భోజనం తర్వాత ఇంకొకటి తీసుకుంటే మంచిదట. దీంతో శరీరంలోని పొటాషియం శాతం తగ్గుతుందని, మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించొచ్చని అంటున్నారు పరిశోధకులు. స్పానిష్‌, నట్స్‌, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే రోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే గుండెపోటుతోపాటు రక్తపోటు లాంటి రుగ్మతలు చాలామటుకు తగ్గిపోతాయని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment