Friday, April 28

వేసవి వరం తాటి ముంజలు…

వేసవి కాలంలో మధురమైన రుచులనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండు మరియు తాటి ముంజలు.. ఈ కాలంలోనే ఇవి మన ముందుకు వచ్చి నోరూరిస్తాయి. ముంజలు మండు వేసవిలో దాహాన్ని ఇట్టే తీరుస్తాయి. సహజసిద్దమైన తియ్యి నీరు, మృదువైన గుజ్జు, మరెన్నో ఔషధ గుణాలతో కూడిన తాటి ముంజలు గురించి తెలుసుకొందాం...
పల్లె, పట్టణము అనే తేడా లేకుండా వేసవిలో ప్రతిచోట లభించే తాటి ముంజలంటే ఇష్టం లేనివారు ఉండరు. వీటిలో నీటి శాతం ఎక్కువ. కార్బోహైడ్రేట్లు అతి తక్కువ కావటం వల్ల మండే ఎండల్లో దాహార్తిని ఆరికడుతుంది. శరీరం నీటి ని కోల్పోకుండా అడ్డుకొని, ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ముంజలు జీర్ణం కావానికి పట్టే సమయం గంట.
ఇక ఔషధ గుణాల విషయానికి వస్తే...
1) లేత ముంజలలో అధిక శాతం తేమ ఉంటుంది. అత్యల్ప శాతం (0.1 గ్రా) క్రొవ్వు పదార్థాలు, పరిమిత స్థాయిలో పిండి పదార్థాలు ఉన్నందున హృద్రోగులు, చక్కెర వ్యాధిగ్రస్తుల, స్థూలకాయులు వీటిని 2 నుంచి 4 వంతున ఫలాహారంగా తీసుకోవచ్చు.
2) ఎండాకాలంలో అరిచేతులు, కాలిమంటలు, శరీరంలో నీరు తగ్గిపోవటం (Dehydration), దాహం వేయటం, తదితర సమస్యలతో బాధపడేవారు తగు మోతాదులో ముంజల్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
3) ఎండాకాలంలో మూత్రం సాఫీగా రాని వారికి లేత తాటి ముంజలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. మూత్ర విసర్జనలో మంట వంటి సమస్యలనూ ఇవి నివారిస్తాయి.
4) గర్భిణులకు కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.
5) తాటిముంజలు ఎక్కువగా తింటే శరీరంలో నీరు చేరుతుంది. జీర్ణప్రకియ కూడా ఆలస్యమవుతుంది.
6) ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.. పరగడుపున ముంజలు తింటే ఆకలి మందగిస్తుంది. తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి.
7) ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.
8) చాల ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది ముంజలను పైన వుండే పొట్టును తీసేసి తింటారు. కానీ ఆలా తినకూడదు.. ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా చాలా మంచిది.

No comments:

Post a Comment