Monday, April 10

తేనె కలిస్తే.. ఆ రుచే వేరు

సహజ చక్కెరలను కలిగి ఉండే తేనెను నేరుగా తీసుకోవడంతో పాటు వివిధ ఆహారాల్లో రుచికోసం కూడా వాడుకోవచ్చు. అదెలా అంటారా....ఇలా..ఇదిగో...
  • ప్రకృతిలో లభించే సహజమైన తియ్యని పదార్థం తేనె. బంగారు రంగులో ఉంటుంది. జిగురు గుణాన్ని కలిగి ఉండే తేనె ఆహార పదార్థాలను మరింత రుచిగా మారుస్తుంది.
  • తేనెతో చేసిన టోస్ట్‌ రుచికరమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెండు బ్రెడ్‌ ముక్కలను తీసుకొని బ్రెడ్‌ పై ఒక పొరలా తేనెను రాయాలి. తర్వాత దీనిపై పీ నట్‌ బటర ను కూడా రాసి తినాలి. ఈ రకంగా తయారు చేసిన టోస్ట్‌ చాలా బాగుంటుంది.
  • రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌ మరింత రుచిగా చేయాలనుకుంటున్నట్లైతే తాజా పండ్ల ముక్కలకు ఫ్యాట్‌ తొలగించిన పెరుగుతో పాటూ తేనె కూడా కలపాలి. వీటితో తేనెను తృణధాన్యాలను కలిపి కూడా తినవచ్చు. బ్రౌన్‌ రైస్‌ క్రాకర్‌ కు పైన బాదం బటర్‌. తేనె కలిపి కూడా తినొచ్చు.
  • రోజూ తినే సలాడ్‌కు తేనె కలపడం ద్వారా వాటికి అదుÄ్భతమైన రుచి వస్తుంది. తేనెలో ఉండే సహజ చక్కెరలు సలాడ్‌లో ఉండే ముక్కలకు అందుతాయి. దీంతో పాటు తులసి కలపటం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
  • తేనెతో రోస్టెడ్‌ చికెన్‌ తయారుచేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో తేనె, ఆవాలు, సోయాసాస్‌ను కలపాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ కు అంటించాలి. ఇలా పూసిన తరువాత కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటూ అలాగే ఉంచి రోస్ట్‌ చేయాలి.

No comments:

Post a Comment