Wednesday, April 19

బొప్పాయి...

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే మొక్క ఇది. బొప్పాయిలో అధిక పీచు ఉంటుంది. కొవ్వు శాతాన్ని ఇది తగ్గిస్తుంది. కొవ్వును దగ్ధం చేసే ఎంజైములు ఉండటం వల్ల గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది...

  • బొప్పాయిలోని యాంటీ యాసిడ్లు చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతాయి.
  • బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వల్ల జీర్ణ కోశంలోని పురుగులు నశిస్తాయి.
  • మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేసే శక్తి బొప్పాయిలో ఉంది.
  • బొప్పాయి రసం పెద్ద పేగులోని.. ముఖ్యంగా కోలన్‌ ద్వారా ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది. కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
  • బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీర బరువును తగ్గిస్తుంది ఇది.
  • బొప్పాయిలో విటమిన్లు ఏ, సీలు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కాపాడేందుకు ఇవి దోహదపడతాయి.

No comments:

Post a Comment