Friday, April 28

కోపంగా ఉన్నారా? అయితే..

కోపం.. మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. ఉద్రేకం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అయితే.. దాన్ని తక్షణమే తగ్గించుకోవడానికి ఓ అద్భుత చిట్కా ఉందంటున్నారు నిపుణులు. కోపం వచ్చినప్పుడు నోట్లో కాస్త చక్కెర వేసుకుంటే అది అప్పటికప్పుడే మటుమాయం అవుతుం దని ఒహియో విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్య యనంలో తేలింది. నోట్లో చక్కెర వేసుకుంటే కోపమే కాదు.. నిగ్రహాన్ని నియంత్రించొచ్చని వెల్లడైంది. దీనికి మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని పరిశోధకులు అంటు న్నారు. ఉద్రేకం కలగకుండా ఉండాలంటే మనో నిగ్రహం కావాలి. దీనికి శరీరంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ శక్తిని గ్లూకోజే మెదడుకు అందిస్తుంది. ఇలా గ్లూకోజుకు, ఉద్రేకానికి దగ్గర సంబంధం ఉంటుంది. తీయటి పానీయాలు తాగటం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుందని, ఇది ఇతరులపై దౌర్జన్యానికి పాల్పడకుండా చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజును వినియో గించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారు త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారని, ఇతరులను క్షమించ టానికీ ఇష్టపడరని పరిశోధనల్లో తేలింది.

No comments:

Post a Comment