Wednesday, April 19

మేలు చేసే ఉసిరి...

ఉసిరికాయను వేసవి సీజన్లో దీనిని వాడడం వల్ల చాలా లాభాలున్నాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు...
  • ఉసిరికాయల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
  • ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే అసిడిటీ వల్ల వచ్చే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. ఉసిరికాయల రసానికి ద్రాక్ష పండ్ల గుజ్జు, పంచదార కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఉసిరిపొడికి వేపాకు పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే దీర్ఘకాలం నుంచి బాధించే చర్మవ్యాధులు తగ్గుతాయి.
  • ఉసిరి కాయల రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారైన చీము పొక్కులు తగ్గుతాయి.
  • లేత ఉసిరి కాయలను ఎంచుకొని తెచ్చి, మేకపాలతో కలిపి మెత్తని పేస్టు మాదిరిగా నూరి, ఫేస్‌ ప్యాక్‌గా వేస్తే మచ్చలు తగ్గుతాయి.
  • ఉసిరి రసాన్ని 160 మిల్లీలీటర్ల మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
  • ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

No comments:

Post a Comment