Saturday, April 15

పెరుగుతో ప్రయోజనాలెన్నో...

భారతీయుల నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. గడ్డపెరుగులో గాఢమైన అణువుల బంధనాలున్నట్లే పెరుగుతో మనకి అనుబంధం ఎక్కువే.! ఇంతకీ పెరుగులో ఉండే మెరుగు విషయాలేంటో తెల్సుకుందాం...
  • ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే శరీరానికి చల్లదనం వస్తుంది. దీంతో పాటు అందులో శరీరానికి ఉపయోగపడే న్యూట్రిన్లు పుష్కలంగా ఉంటాయి.
  • పెరుగు తినటం వల్ల కడుపులోని సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.
  • పెరుగులో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లూ ఎక్కువగా ఉంటాయి.
  • హైడ్రేట్స్‌ ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
  • రోజూ అరకప్పు పెరుగు తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • మానసిక ఒత్తిడిని అదుపు చేస్తుంది.
  • చర్మం మెరుపు రావాలన్నా, జుట్టు బలంగా ఉండాలన్నా పెరుగుని డైరక్ట్‌గా అప్లై చేసి ఫలితాలు పొందవచ్చు. అన్ని కాలాల్లో పెరుగుని తీసుకోవచ్చు. అందుకే పెరుగు తీసుకోవటం, పెరుగుతో చేసిన ఆహారాన్ని తినటం మర్చిపోకూడదు.
  •  దైనందిన జీవితంలో పెరుగు తీసుకోవటం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలకి చెక్‌ పెట్టినట్టే!

No comments:

Post a Comment