రాగుల్లో ఉండే పోషకాలు శరీర
ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా ఆహారంలో భాగంగా
తీసుకునేవారు రకరకాల అనారోగ్య సమస్యలను అధిగమించే అవకాశాలెక్కువగా ఉన్నాయని
నిపుణులు చెబుతునాన్నారు...
- రాగులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. మిల్లెట్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి వయసు మీద పడినట్లు కనిపించనివ్వవని నిపుణులు చెబుతున్నారు.
- రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదనపు క్యాలరీలను గ్రహించకుండా నిరోధిస్తుంది.
- రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి.
- రాగులు బలవర్ధకమైన ధాన్యం. దానిలోని క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆరోగ్య పుష్టిని కలిగిస్తుంది.
- రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
- రాగులలో అయోడిన్ బాగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి, పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.
- నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్‌ను తాగాలి.
- రాగులతో చేసిన ఆహారం ఆందోళన, వ్యాకులత, నిద్రలేమిరర పరిస్థితులను దూరం చేస్తుంది. మైగ్రేన్ సమస్యను నివారిస్తుంది.
- రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం శక్తినిస్తాయి.
- రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే నూతన శక్తి వస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
- సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని సహజమైన తీరులో ఉంచడానికి సహాయపడుతుంది.

No comments:
Post a Comment