- పాలు వేడిచేసి చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
- పసుపు కొమ్ములను నూరి, నీళ్లలో అరగదీసి గానీ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్లతో చాది గానీ కడితే సెగ్గడ్డలు, కరుపులు మెత్తబడతాయి. పుండ్లు మానుతాయి.
- వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ని రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధుల్లో దురద, మంట, పోటు తగ్గుతాయి.
- పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
- వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
- మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు తగ్గుతాయి.
- నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తుంటే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
Thursday, April 20
పసుపుతో ప్రయోజనాలు పుష్కలం...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment