మూత్ర సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా
పెరిగిపోతున్న రోజులివి. అందుకే రోజూ తీసుకొనే ఆహరంలో మూత్రపిండాలకు మేలు
చేసే కాయగూరలు అందేలా జాగ్రత్త పడటం మంచిది. క్యాబేజీలో కె విటమిన్ , సి
విటమిన్, పీచు పదార్థం అధికంగా ఉండటం వలన ఇవి బరువు అదుపులో ఉండటమే
కాకుండా, రోగినిరోధక శక్తిని పెంచుతాయి. మూత్రపిండాల్లోని వ్యర్ధాలను బయటకు
పంపుతాయి క్యాలీఫ్లవర్ కూడా మూత్రపిండాలను శుభ్రపరచడంలో కీలకపాత్ర
పోషిస్తుంది. అలాగే ఉల్లిపాయల్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల
మూత్రపిండాలకు రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. రాళ్ళు ఏర్పడినా వాటిని దూరం
చేయడానికి దోహదం చేస్తాయి. వెల్లుల్లి, క్యారెట్‌లు కూడా మూత్రపిండాల
సంరక్షణలో తోడ్పాటును అందిస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.
ఇవి మూత్రపిండాలలో తలెత్తే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఒక
క్యారెట్ తింటే, లేదా గ్లాసు క్యారెట్ రసం తీసుకుంటే మూత్ర పిండాలకు చాలా
మంచిది. ముల్లంగి కూడా మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో
పోషకాలు , ఔషధ గుణాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీన్ని తరచూ తీసుకోవడం
వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రసంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు
దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.

No comments:
Post a Comment