వీలున్నప్పుడు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోతే
ఆరోగ్యానికి మంచిదేనట. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, శరీరం చురుగ్గా
ఉండటానికి ఇది చాలా అవసరమని అంటున్నారు నిపుణులు. రక్తపోటు నియంత్రణకు
మధ్యాహ్న నిద్ర దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా
అడ్డుకుంటుంది. రాత్రి నిద్రపట్టని వారు, అనారోగ్యంతో బాధపడే వారికి పగటి
నిద్ర మంచిది. వేసవిలో పగలు నిద్ర పోవచ్చు. అయితే.. పగటి నిద్రతో ఎన్ని
ప్రయోజనాలున్నా కొన్ని సమస్యలు మాత్రం తప్పవని అంటున్నారు నిపుణులు.
దైనందిన పనుల్లో ఆటంకం కలిగి శారీరక శ్రమ లోపిస్తుందని, తగిన వ్యాయామం
లేకపోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయానాల్లో తేలింది.
పగలు ఎక్కువగా నిద్రపొతే రాత్రులు నిద్రపట్టకపోవచ్చు. తద్వారా ఆరోగ్యానికి
హానికలగొచ్చు. కాబట్టి అవసరం ఉన్నంత మేరకే పగలు నిద్రపోవాలి. భారీ
కాయస్తులకు పగటి నిద్ర మంచిది కాదు. అంతేకాదు.. పగలు ఎక్కువ సేపు నిద్రపోతే
టైప్-2 డయాబెటిస్‌కి దారి తీయొచ్చని అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని
వివిధ రకాల హార్మోన్ల నైసర్గిక సమతౌల్యతపై ఈ పగటి నిద్ర ప్రభావం
చూపిస్తుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర శాతం పెరుగుదలపైన కూడా ప్రభావం
చూపిస్తుంది. అంతేకాక చిన్న చిన్న జబ్బులతో బాధపడే వారు తరచూ పగటి నిద్రకు
అలవాటు పడడాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. శారీరక శ్రమ కలిగించే
పనుల్లో నిమగం కావడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవడం ఈ పగటి
నిద్రపోయే వారికి మంచిదని నిపుణులు అంటున్నారు.
No comments:
Post a Comment