Thursday, April 20

నిద్ర తక్కువైతే షుగర్‌ పెరుగుతుంది...

తగినంత నిద్ర లేనివారు త్వరగా మధుమేహం బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం ఆరుగంటలకే నిద్ర లేవాల్సిందే. ఇక ఉద్యోగులు అయితే ఐదుగంటలకే నిద్రలేచి, పనుల పరుగుల్లో అలసిపోవాల్సిందే. ఒకవైపు నిద్ర సరిగ్గా ఉండదు. సరిగా నిద్ర పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్‌ త్వరగా సోకే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణగా గుర్తించారు. నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్‌ జబ్బు వస్తుంది. ఇక డయాబెటిస్‌ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. దీనివలన హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసికెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులు తగినంత వ్యాయామం చేయడమే కాదు, తగినంత నిద్ర కూడా పోవాలి.

No comments:

Post a Comment