Tuesday, April 11

ఆరోగ్యానికి మేలు చేసే వేరుశనగ...

వేరుశనగ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఇది ఆహారంలో పోషకవిలువలు అందించడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు... 

  1. ఎక్కువగా సాయంత్రపు సమయంలో స్నాక్స్‌ గా తీసుకునే వేరుశనగను పచ్చివిగా కాకుండా, నీటిలో ఉడకబెట్టుకొని తినటం వలన మరింత మెరుగైన ప్రయోజనాలున్నాయి.
  2. ఉడికించిన వేరుశనగలో విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి పుష్టినివ్వడమే కాకుండా పిండాబివృద్ధికీ, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.
  3. ఉడికించిన వేరుశనగలో ఉండే ఫైబర్లు (పీచుపదార్ధాలు) మలబద్ధకాన్ని తగ్గించటమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహా వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. -ఉడికించిన వేరుశనగలో ఉండే కొవ్వు పదార్థాలను మోనోశాచరైడ్స్‌ అంటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులకు గురవకుండా ఉండాలంటే వీటిని తినాల్సిందే.
  4. వేయించిన వేరుశనగలో కన్నా ఉడికించిన వేరుశనగలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. వీటిలో అధిక మొత్తంలో పోషకాలుంటాయి.

No comments:

Post a Comment