కాళ్ల పగుళ్లు, కాళ్లమీద పొడిచర్మం నివారించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
- డ్రై స్కిన్ నివారించడంలో ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల కాళ్ళును పూర్తిగా తేమగా ఉంచుతుంది, పాదాలకు తేమను అందిస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కాళ్లకు ఆలివ్ ఆయిల్‌ను అప్లై చేసి, మసాజ్ చేయాలి. స్నానం చేసిన తర్వాత కూడా కాళ్లకు మాయిశ్చరైజర్ అప్లై చేయడానికి ముందు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాలి.
- పెరుగు, తేనె మాస్క్ మరో రెమెడీ. ఇది చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. వీటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ డ్రై స్కిన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అరకప్పు పెరుగులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. తర్వాత కాళ్లకు, పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
- రెండు స్పూన్ల మిల్క్ క్రీమ్ తీసుకుని, అందులో ఒక స్పూన్ శెనగపిండి మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మిల్క్ క్రీమ్‌లో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కాళ్లకు తేమను అందించి మాయిశ్చరైజింగ్ ఉంచడంలో సహాయపడుతుంది.
- కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీయాసిడ్స్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. చర్మం తేమగా ఉంటుంది.
- కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని కాళ్లకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో పద్ధతిలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, గోరువెచ్చగా చేసి, కాళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి.
- 1/4కప్పు బ్రౌన్ షుగర్ తీసుకుని, అందులో కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, కాళ్ళు, పాదాలకు అప్లై చేయాలి. స్క్రబ్ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డ్రై స్కిన్‌ని నివారిస్తుంది. కొబ్బరి నూనె కాళ్లు, పాదాలను మాయిశ్చరైజ్ చేస్తుంది. ఎప్పుడూ తేమగా ఉంచుతుంది.
No comments:
Post a Comment